అక్షరటుడే, కామారెడ్డి : Blood Donation Camp | ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. పోలీసు అమర వీరుల వారోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్పీ.. రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈనెల 21 నుంచి 31 వరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. తనతో పాటు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదాన శిబిరంలో (Blood Donation Camp) పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. రక్తదాన శిబిరం ద్వారా 195 యూనిట్ల రక్తం రెడ్‌క్రాస్ సొసైటీకి (Red Cross Society) అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, సీఐలు, ఎస్సైలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్ రాజన్న, విద్యార్థులు, కళాశాలల యజమాన్యాలు తదితరులు పాల్గొన్నారు.

