అక్షరటుడే, వెబ్‌డెస్క్: Trump Health Update | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆరోగ్య పరిస్థితి గురించి ఇటీవల సోషల్ మీడియాలో వదంతులు ఊపందుకున్నాయి. ట్రంప్ కాళ్లలో వాపు, చేతిపై మచ్చలు రావడంతో పాటు ఆయన 24 గంటల పాటు ప్రజలకు కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యం విషయంలో అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి.
సోషల్ మీడియాలో “Trump Dead” అనే హ్యాష్‌ట్యాగ్ (Hash Tag) కూడా ట్రెండింగ్ అయింది. ఈ వదంతుల వేళ ట్రంప్‌కి సంబంధించిన కొత్త ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో ఆయన తన మనవడు, మనవరాలితో కలిసి వైట్ హౌస్ సౌత్ బ్లాక్‌లో ఆడుకుంటూ కనిపించారు. దీంతో ఆయన ఆరోగ్యంపై వ్యాపిస్తున్న వార్తలకు కొంతవరకు బ్రేక్ పడింది.
Trump Health Updates | నిజమేంటి..
ఆ ఫొటోలు కొత్తవా లేక పాతవా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక ట్రంప్‌కి ఉన్న అనారోగ్యం ఏమిటన్నదానిపై అమెరికన్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. ట్రంప్‌కి CVI (Chronic Venous Insufficiency) అనే వ్యాధి ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిని ‘సిరలు దెబ్బతినడం’ అని అంటారు. దీని గురించి అమెరికన్ వైద్యురాలు మిమీ కాంగ్ మాట్లాడుతూ.. “CVI అనేది చాలా మంది అమెరికన్లలో కనిపించే సమస్య. ఇది సాధారణంగా కాళ్లలో వాపు, చర్మం పొడిబారడం, తోలు మందం కావడం, మంటలు రావడం వంటి లక్షణాలతో కనిపిస్తుంది. తీవ్రమైతే మానని గాయాలు, చివరికి శరీర భాగాల తొలగింపు అవసరమయ్యే పరిస్థితికి తీసుకువెళ్లొచ్చు” అని పేర్కొన్నారు.
ట్రంప్ ఆరోగ్యంపై వైట్ హౌస్ (White House) స్పందిస్తూ.. ఆయన (Trump) రోజూ ప్రజలకి పదే పదే హ్యాండ్‌షేక్ ఇవ్వడంతో స్వల్ప ఒత్తిడికి గురయ్యారని పేర్కొంది. ఇది అంత పెద్ద ఆరోగ్య సమస్య కాదని స్పష్టం చేసింది. ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు ఎంతవరకు నిజం అన్నది అధికారికంగా ఇంకా స్పష్టత రాలేదు గానీ, తాజాగా బయటపడిన కుటుంబ ఫొటోలు, వైట్ హౌస్ ప్రకటన చూస్తే పరిస్థితి ఆందోళనకరంగా లేదని అర్థమవుతోంది. అయితే, ట్రంప్ వైఖరిని బట్టి చూస్తే ఆయన త్వరలోనే ప్రజల ముందుకు ప్రత్యక్షమై వదంతులకు స్వయంగా సమాధానం ఇవ్వవచ్చు.