అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Donald Trump | రష్యా, ఉక్రెయిన్(Russia – Ukraine) మధ్య కాల్పుల విరమణ (Ceasefire) కోసం అమెరికా (America) ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద వైమానిక దాడులను ప్రారంభించింది.
దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Trump) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Russia President Putin)ను “పిచ్చివాడు” అని అభివర్ణించారు. పుతిన్ పిచ్చిపట్టి వ్యవహరిస్తున్నారని, అవసరం లేకపోయినా చాలా మందిని చంపేస్తున్నారని మండిపడ్డారు. ఉక్రెయిన్ను పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం “రష్యా పతనానికి దారి తీస్తుంది” అని కూడా ఆయన హెచ్చరించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్‌లో పుతిన్‌పై విరుచుకుపడ్డారు. పుతిన్‌పై తాను సహనం కోల్పోతున్నానని స్పష్టం చేశారు.
Donald Trump | రష్యా పతనమే..
మాస్కో వరుసగా మూడోరోజూ డ్రోన్లు, క్షిపణులతో కీవ్ సహా ఇతర ఉక్రెయిన్ నగరాలపై దాడి చేయడంతో రష్యాపై తీవ్ర విమర్శలు చేశారు. ‘అతను (పుతిన్) ఉక్రెయిన్ మొత్తాన్ని కోరుకుంటున్నాడు. ఇది రష్యా పతనానికి దారి తీస్తుందని’ హెచ్చరించారు. “రష్యాకు చెందిన వ్లాదిమిర్ పుతిన్‌తో నాకు ఎప్పుడూ చాలా మంచి సంబంధం ఉంది, కానీ అతనికి ఏదో జరిగింది! అతను పూర్తిగా పిచ్చివాడిగా మారాడు! అతను అనవసరంగా చాలా మందిని చంపుతున్నాడు. నేను సైనికుల గురించి మాత్రమే మాట్లాడటం లేదు. కారణం లేకపోయినా ఉక్రెయిన్ నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకు పడుతున్నారు. ఉక్రెయిన్(Ukraine) భూ భాగంలో కొంత భూభాగాన్ని కాదు.. ఆ దేశం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన దృష్టిలో అది సరైనదే కావొచ్చు. కానీ అది రష్యాకు ఏ మాత్రం మంచిది కాదని’ హెచ్చరించారు.
Donald Trump | జెలెన్స్కీపైనా ఆగ్రహం
మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Ukrainian President Zelensky)పైనా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు, ఆయన మాట్లాడే విధానం కారణంగా ఉక్రెయిన్‌కు “ఎటువంటి సహాయం” చేయడం లేదన్నారు. అదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden)ను విమర్శించారు.
“ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తనలాగే మాట్లాడటం ద్వారా తన దేశానికి ఎటువంటి మేలు చేయట్లేదు. ఆయన (జెలెన్స్కీ) నోటి నుంచి వచ్చే ప్రతి మాట సమస్యలను కలిగిస్తుంది, నాకు అది ఇష్టం లేదు, దానిని ఆపడం మంచిది. నేను అధ్యక్షుడైతే ఇది ఎప్పటికీ ప్రారంభం కాని యుద్ధం. ఇది జెలెన్స్కీ, పుతిన్, బైడెన్ యుద్ధం, ‘ట్రంప్’ యుద్ధం కాదు, నేను మంటలను ఆర్పడానికి మాత్రమే సహాయం చేస్తున్నాను, అవి తీవ్ర అసమర్థత, ద్వేషం ద్వారా ప్రారంభించబడ్డాయి” అని ట్రంప్ పేర్కొన్నారు.