Homeబిజినెస్​Stock Markets | నష్టాల్లోనే దేశీయ స్టాక్‌ మార్కెట్

Stock Markets | నష్టాల్లోనే దేశీయ స్టాక్‌ మార్కెట్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | భారత్‌పై యూఎస్‌ విధించిన 25 శాతం అదనపు సుంకాల (Tariffs)తో దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి. ప్రధాన సూచీలు నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. గురువారం ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 281 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. అక్కడినుంచి కోలుకుని 159 పాయింట్లు పెరిగినా.. ఆ తర్వాత మళ్లీ కిందికి దిగజారింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 214 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ(Nifty) 110 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 78 పాయింట్లు పెరిగింది. ఆ తర్వాత 82 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 422 పాయింట్ల నష్టంతో 80,121 వద్ద, నిఫ్టీ 137 పాయింట్ల నష్టంతో 24,436 వద్ద కొనసాగుతున్నాయి.

Stock Markets | ఐటీ మినహా..

ఐటీ(IT) మినహా అన్ని రంగాల షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. బీఎస్‌ఈలో మెటల్‌ 1.01 శాతం, టెలికాం 0.96 శాతం, పవర్‌ ఇండెక్స్‌ 0.92 శాతం, ఇన్‌ఫ్రా 0.84 శాతం, కమోడిటీ ఇండెక్స్‌ 0.70 శాతం, ఆటో 0.70 శాతం, రియాలిటీ 0.67 శాతం, పీఎస్‌యూ 0.67 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 0.64 శాతం, ఎనర్జీ 0.58 శాతం, బ్యాంకెక్స్‌ (Bankex) 0.49 శాతం నష్టాలతో కొనసాగుతున్నాయి. ఐటీ 0.23 శాతం లాభంతో కొనసాగుతోంది. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.51 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.42 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.40 శాతం నష్టాలతో ఉన్నాయి.

Stock Markets | Gainers..

బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో (BSE Sensex) 5 కంపెనీలు లాభాలతో ఉండగా.. 25 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఎటర్నల్‌ 0.70 శాతం, ఐటీసీ 0.61 శాతం, పవర్‌గ్రిడ్‌ 0.56 శాతం, టైటాన్‌ 0.31 శాతం, ట్రెంట్‌ 0.29 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి.

Stock Markets | Top losers..

టాటా మోటార్స్‌ 1.71 శాతం, అదాని పోర్ట్స్‌ 1.70 శాతం, కొటక్‌ బ్యాంకు 1.08 శాతం, రిలయన్స్ 0.99 శాతం నష్టాలతో ఉన్నాయి.

Must Read
Related News