Homeబిజినెస్​Stock market |ఒడిదుడుకుల్లో సూచీలు

Stock market |ఒడిదుడుకుల్లో సూచీలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Domestic stock markets) తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 693 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. కోలుకుని 9 వందలకుపైగా పాయింట్లు పెరిగింది. వెంటనే 950 పాయింట్లపైగా పడిపోయింది. 146 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ (Nifty) సైతం ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. మొదట్లోనే ప్రారంభ నష్టాల నుంచి కోలుకుని ఇంట్రాడే (Intraday)లో గరిష్టంగా 70 పాయింట్లు లాభపడింది. అక్కడి నుంచి 230 పాయింట్ల వరకు పడిపోయింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 2 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. బీఎస్‌ఈ (BSE) త్రైమాసిక ఫలితాలు బాగుండడంతో 6 శాతానికిపైగా పెరిగింది. పేటీఎం సైతం నష్టాలను తగ్గించుకోవడంతో సుమారు 7 శాతం ర్యాలీ తీసింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల శిబిరాలపై భారత్‌(Bharath) దాడి చేయడంతో బుధవారం డిఫెన్స్‌ స్టాక్స్‌ రాణిస్తున్నాయి.

stock market | Top Losers..

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE sensex) 30 ఇండెక్స్‌లో (index) 15 కంపెనీలు నష్టాలతో ఉండగా.. 15 కంపెనీలు లాభాలతో సాగుతున్నాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ (Indusind bank), సన్‌ఫార్మా, ఆసియా పెయింట్స్‌ ఒక శాతానికిపైగా నష్టంతో, నెస్లే, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎల్‌అండ్‌టీ(LT)లు నష్టంతో ఉన్నాయి.

stock market | Top Gainers..

టాటా మోటార్స్‌(Tata motors) అత్యధికంగా 4.08 శాతం లాభంతో కొనసాగుతోంది. టైటాన్‌, పవర్‌ గ్రిడ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం(M&M) ఒక శాతానికిపైగా లాభంతో ఉంది.

Must Read
Related News