అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ల(Domestic stock markets)లో వరుస లాభాలకు బ్రేక్ పడింది. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లలో నిఫ్టీ ఫ్లాట్‌గా ముగియగా.. సెన్సెక్స్ స్వల్ప నష్టాలతో సెషన్‌ను ముగించింది. మంగళవారం ఉదయం 198 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్.. అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. ఇంట్రాడే(Intraday) గరిష్టాలనుంచి 4 వందలకుపైగా పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ (Nifty) 93 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా.. లాభాలను నిలబెట్టుకోలేకపోయింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 140 పాయింటు కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ (Sensex) 53 పాయింట్ల నష్టంతో 82,391 వద్ద, నిఫ్టీ ఒక పాయింట్ లాభంతో 25,104 వద్ద స్థిరపడ్డాయి. యూఎస్(US), చైనాల మధ్య వాణిజ్య చర్చలు మంగళవారం రెండోరోజు కొనసాగుతున్నాయి. ఈరోజు చర్చలు కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. చర్చల ఫలితాల కోసం మార్కెట్ ఎదురుచూస్తోంది. వరుసగా నాలుగు రోజులపాటు మార్కెట్లలో ర్యాలీ కొనసాగడంతో స్వల్ప ప్రాఫిట్ బుకింగ్ (Profit booking) కనిపించింది. దీంతో సూచీలు ప్రారంభ లాభాలను నిలబెట్టుకోలేకపోయాయి.
బీఎస్‌ఈ(BSE)లో 2,232 కంపెనీలు లాభపడగా 1,805 స్టాక్స్ నష్టపోయాయి. 135 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 137 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 33 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 10 కంపెనీలు అప్పర్ సర్క్యూట్(Upper circuit)ను, 6 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Markets | ఐటీ షేర్లలో ర్యాలీ.. రియాలిటీలో సెల్లాఫ్..
బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్ (IT index) 1.63 శాతం, పవర్ ఇండెక్స్ 0.95 శాతం పెరిగాయి. హెల్త్‌కేర్, ఎఫ్‌ంఎసీజీ, కన్జూమర్ గూడ్స్ సెక్టార్ల స్టాక్స్ 0.45 శాతం మేర లాభాలతో ముగిశాయి. రియాలిటీ ఇండెక్స్ 1.18 శాతం క్షీణించగా.. పీఎస్‌యూ బ్యాంక్ (PSU bank) ఇండెక్స్ 0.76 శాతం పడిపోయింది. బ్యాంకెక్స్, ఎనర్జీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.
Stock Markets | Top 5 gainers..
బీఎస్‌ఈలో నమోదైన షేర్లలో రతన్ ఇండియా పవర్ (Rattan India Power) 20 శాతం, రతన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ 19.99 శాతం పెరిగాయి. రిలయన్స్ పవర్ 11.42 శాతం, కాఫీ డే 9.84 శాతం, ప్రిస్మ్ జాన్సన్ 9.24 శాతం లాభపడ్డాయి.
Stock Markets | Top 5 losers..
సన్‌ఫ్లాగ్ ఐరన్ (Sunflag Iron) 4.25 శాతం, ఆర్‌బీఎల్ బ్యాంక్ 3.85 శాతం, వెస్ట్‌లైఫ్ ఫుడ్ వరల్డ్ 3.82 శాతం, కోరొమండల్ ఇంటర్నేషనల్ 3.23 శాతం, నిప్పాన్ లైఫ్ ఏఎంసీ 3.17 శాతం నష్టపోయాయి.