అక్షరటుడే, వెబ్‌డెస్క్: Domestic markets | దేశీయ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 55 పాయింట్ల కోల్పోయాయి. కాగా.. గ్లోబల్ మార్కెట్లు (Global markets) మిశ్రమంగా ఉన్నాయి.
యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగియగా.. యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సోమవారం ఉదయం షాంఘైతో పాటు గిఫ్ట్‌నిఫ్టీ (Gift nifty) మినహా మిగతా ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నా.. తర్వాత కొన్ని మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
Domestic markets | యూఎస్ మార్కెట్లు..
వాల్‌స్ట్రీట్ (Wallstreet) లాభాలతో ముగిసింది. గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 0.61 శాతం, ఎస్‌అండ్‌పీ 0.26 శాతం పెరిగాయి. ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.09 శాతం లాభంతో ఉంది. అమెజాన్(Amazon) స్టాక్ ధర 9.6 శాతం పెరగ్గా.. టెస్లా 3.74 శాతం, నెట్‌ఫ్లిక్స్ 2.7 శాతం లాభపడ్డాయి. మైక్రోసాఫ్ట్ షేర్లు 1.51 శాతం, వాల్‌మార్ట్ ఒక శాతం క్షీణించాయి.
Domestic markets | యూరోప్ మార్కెట్లు..
డీఏఎక్స్(DAX) 0.67 శాతం, సీఏసీ 0.49 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.44 శాతం పడిపోయాయి.
Domestic markets | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు (Asian markets) ఉదయం 8 గంటల సమయంలో ఎక్కువగా లాభాలతో సాగుతున్నాయి. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 2.16 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ (Hang Seng) 0.48 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.38 శాతం లాభాలతో కొనసాగుతుండగా.. చైనాకు చెందిన షాంఘై 0.19 శాతం నష్టంతో ఉంది. గిఫ్ట్ నిఫ్టీ 0.18 శాతం నష్టంతో కొనసాగుతోంది. దీంతో మన మార్కెట్లు గ్యాప్‌డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. జపాన్, సింగపూర్‌లలో ప్రభుత్వ సెలవు దినం కావడంతో అక్కడి మార్కెట్లు తెరుచుకోలేదు.
