అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic Stock Market) ఆశావహ దృక్పథంతో నూతన వారాన్ని ప్రారంభించాయి. ప్రధాన సూచీలు వరుసగా మూడో సెషన్‌లోనూ లాభాల బాటలో కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో నిఫ్టీ మరోసారి 25 వేల మార్క్‌ను తాకింది. యూఎస్‌తో ట్రేడ్ డీల్ విషయంలో అనిశ్చిత పరిస్థితి కొనసాగుతుండడంతో విక్స్(VIX) 3 శాతం వరకు పెరిగింది. స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తుండగా.. ఐటీ, ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్లు రాణిస్తున్నాయి.
సోమవారం ఉదయం సెన్సెక్స్ 67 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ(Nifty) 22 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. తొలుత కొంత ఒడిదుడుకులకు లోనైనా లాభాలబాట పట్టి స్థిరంగా పెరుగుతున్నాయి. సెన్సెక్స్ 81,155 నుంచి 81,606 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 24,881 నుంచి 25,016 పాయింట్ల మధ్యలో సాగుతున్నాయి. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 386 పాయింట్ల లాభంతో 81,593 వద్ద, నిఫ్టీ 104 పాయింట్ల లాభంతో 24,998 వద్ద ఉన్నాయి.
రాణిస్తున్న ఐటీ, బ్యాంకింగ్ సెక్టార్లు..
ఐటీ(IT), బ్యాంకింగ్ సెక్టార్లు రాణిస్తుండగా.. మెటల్, కన్జూమర్ డ్యూరెబుల్ సెక్టార్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్ 1.61 శాతం, బ్యాంకెక్స్(Bankex) 0.93 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.79 శాతం, హెల్త్‌కేర్ ఇండెక్స్ 0.49 శాతం పెరిగాయి. మెటల్ సూచీ 1.21 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ 0.79 శాతం, యుటిలిటీ 0.79 శాతం, ఇన్‌ఫ్రా 0.64 శాతం, పవర్ 0.60 శాతం, కమోడిటీ 0.55 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్ 0.50 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.47 శాతం నష్టాలతో ఉన్నాయి. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.35 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.14 శాతం లాభాలతో ఉండగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.26 శాతం నష్టంతో ఉంది.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 17 కంపెనీలు లాభాలతో ఉండగా.. 13 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్ 2.24 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.09 శాతం, టెక్ మహీంద్రా 2.03 శాతం, టీసీఎస్ 1.97 శాతం, కొటక్ బ్యాంక్ 1.74 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : టాటా స్టీల్ 2.19 శాతం, పవర్‌గ్రిడ్ 1.45 శాతం, అదానీ పోర్ట్స్ 1.38 శాతం, టాటామోటార్స్ 1.31 శాతం, టైటాన్ 1.19 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.