Homeబిజినెస్​Stock Market | లాభాల బాటలో దేశీయ మార్కెట్లు

Stock Market | లాభాల బాటలో దేశీయ మార్కెట్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఊహించినట్లుగానే ఆర్‌బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతూ వృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌(RBI Governor) తెలిపారు. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి.

బుధవారం ఉదయం సెన్సెక్స్‌ 94 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 9 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. తొలుత కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ తిరిగి లాభాలబాటపట్టి స్థిరంగా పెరుగుతున్నాయి. సెన్సెక్స్‌ 80,159 నుంచి 80,525 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ(Nifty) 24,605 నుంచి 24,741 పాయింట్ల మధ్యలో సాగుతున్నాయి. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌(Sensex) 185 పాయింట్ల లాభంతో 80,453 వద్ద, నిఫ్టీ 131 పాయింట్ల లాభంతో 24,743 వద్ద ఉన్నాయి. గ్లోబల్‌ మార్కెట్లు పాజిటివ్‌గా ఉండడం, క్రూడ్‌ ఆయిల్‌ ధర తగ్గడం, కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు రాణిస్తున్నాయి. ఐటీ రంగం కోలుకుంటోంది.

మిక్స్‌డ్‌గా సూచీలు..

బీఎస్‌ఈ(BSE)లో బ్యాంకెక్స్‌ 1.01 శాతం, రియాలిటీ 0.66 శాతం, హెల్త్‌కేర్‌ 0.65 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 0.55 శాతం, ఎనర్జీ 0.53 శాతం, ఆటో 0.50 శాతం లాభాలతో ఉన్నాయి. పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.84 శాతం, మెటల్‌ సూచీ 0.64 శాతం, కమోడిటీ 0.46 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.27 శాతం, ఐటీ 0.11 శాతం నష్టాలతో ఉన్నాయి. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.32 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.27 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.23 శాతం లాభాలతో సాగుతున్నాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 16 కంపెనీలు లాభాలతో ఉండగా.. 12 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. టాటామోటార్స్‌ 3.28 శాతం, ట్రెంట్‌ 3.19 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 2.47 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.99 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.81 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : బజాజ్‌ ఫైనాన్స్‌ 1.47 శాతం, ఎల్‌టీ 0.95 శాతం, ఆసియా పెయింట్‌ 0.86 శాతం, ఎస్‌బీఐ 0.82 శాతం, మారుతి 0.77 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.