Homeబిజినెస్​Stock Market | లాభాల బాటలో దేశీయ మార్కెట్లు

Stock Market | లాభాల బాటలో దేశీయ మార్కెట్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | జీఎస్‌టీ హేతుబద్ధీకరణతోపాటు మాక్రో డేటా(Macro data) పాజిటివ్‌గా ఉండడంతో భారత దేశ ఆర్థిక వృద్ధి వేగవంతంగా సాగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికితోడు యూఎస్‌ ఫెడ్‌(US Fed) సైతం వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయి.

ఫెడ్‌ వడ్డీ రేట్లను తగ్గిస్తే ఎఫ్‌ఐఐలు తిరిగి భారత్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉంటాయి. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic Stock Market) వరుసగా రెండోరోజూ లాభాల బాటలో పయనిస్తోంది. మంగళవారం ఉదయం సెన్సెక్స్‌ 156 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. అక్కడినుంచి 106 పాయింట్లు పడిపోయింది. కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో తిరిగి పుంజుకుని 343 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ(Nifty) 28 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమై 22 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 118 పాయింట్లు లాభపడిరది. మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌(Sensex) 278 పాయింట్ల లాభంతో 80,642 వద్ద, నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 24,722 వద్ద కొనసాగుతున్నాయి. ఆగస్టులో జీఎస్టీ(GST) 1.86 టిలియన్ల రూపాయలు వసూలయ్యింది. ఇది గతేడాదితో పోల్చితే 6.5 శాతం ఎక్కువ కావడం గమనార్హం. అలాగే ఆగస్టులో దేశ తయారీ కార్యకలాపాలు కూడా వేగంగా విస్తరించాయి. ఇవి కూడా మార్కెట్లు పెరగడానికి కారణం.

అన్ని సెక్టార్లలో ర్యాలీ..

అన్ని సెక్టార్లలో ర్యాలీ కొనసాగుతోంది. బీఎస్‌ఈ(BSE)లో పవర్‌ 1.83 శాతం, యుటిలిటీ 1.62 శాతం, ఎనర్జీ 1.49 శాతం, ఇన్‌ఫ్రా 1.44 శాతం, పీఎస్‌యూ, ఆయిల్‌ అండ్‌గ్యాస్‌ ఇండెక్స్‌లు 1.34 శాతం, మెటల్‌ 1.32 శాతం, రియాలిటీ 1.24 శాతం, ఎఫ్‌ఎంసీజీ 1.10 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ 0.99 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ 0.90 శాతం, ఐటీ ఇండెక్స్‌ 0.62 శాతం పెరిగాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.04 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.62 శాతం, లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.49 శాతం లాభంతో ఉన్నాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 22 కంపెనీలు లాభాలతో ఉండగా.. 8 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. పవర్‌గ్రిడ్‌ 2.55 శాతం, ఎన్టీపీసీ 1.84 శాతం, రిలయన్స్‌ 1.71 శాతం, టాటా స్టీల్‌ 1.63 శాతం, హెచ్‌యూఎల్‌ 1.31 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఆసియా పెయింట్‌ 0.65 శాతం, ఎంఅండ్‌ఎం 0.51 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.47 శాతం, యాక్సిస్‌బ్యాంక్‌ 0.38 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 0.36 శాతం నష్టంతో ఉన్నాయి.

Must Read
Related News