Homeబిజినెస్​Stock Markets | దేశీయ ఇన్వెస్టర్ల జోరు.. తొలిసారి ఎఫ్‌ఐఐలను దాటిన డీఐఐలు

Stock Markets | దేశీయ ఇన్వెస్టర్ల జోరు.. తొలిసారి ఎఫ్‌ఐఐలను దాటిన డీఐఐలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Stock Markets | భారత్‌(Bharath) ఈక్విటీ మార్కెట్లలో తొలిసారిగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులపై దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు ఆధిపత్యం వహించారు. మార్చి నాటికి డీఐఐ(DII)ల పెట్టుబడులు ఎఫ్‌ఐఐలను మించిపోయాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్లలో మన సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా మార్చి నాటికి 16.91 శాతానికి చేరింది. ఇదే సమయంలో ఎఫ్‌ఐఐ(FII)ల వాటా 16.84 శాతానికి పడిపోయింది. గత 50 నెలల్లో ఇదే కనిష్టం కావడం గమనార్హం. భారత్‌ ఈక్విటీ మార్కెట్ల(Equity markets)లో డీఐఐల పెట్టుబడుల విలువ రూ. 69.80 కోట్లకు చేరగా.. ఎఫ్‌ఐఐల పెట్టుబడుల విలువ రూ. 69.58 కోట్లకు తగ్గింది.

Stock Markets | దేశీయ ఇన్వెస్టర్లలో పెరిగిన నమ్మకం..

గతేడాది సెప్టెంబర్‌నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(Foreign institutional investors) మన మార్కెట్లలో అమ్మకాలకు పాల్పడుతున్నారు. మన మార్కెట్లు ఓవర్‌ వాల్యూ జోన్‌లో ఉన్నట్లు భావించడం, ఇదే సమయంలో చైనా, హాంగ్‌కాంగ్‌(Hong Kong) స్టాక్‌ మార్కెట్లలో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలున్నాయన్న ఆశలతో ఎఫ్‌ఐఐలు ఇక్కడ ప్రాఫిట్‌ బుకింగ్‌కు దిగారు. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం, రూపాయి విలువ బలహీనపడుతూ రావడం, డాలర్‌ ఇండెక్స్‌(Dollar index) పెరగడం కూడా ఎఫ్‌ఐఐల అమ్మకాలకు కారణం. కాగా దేశీయ ఇన్వెస్టర్లు మాత్రం మన మార్కెట్లపై నమ్మకం ఉంచారు. లక్షలాది మంది కొత్త ఇన్వెస్టర్లు వచ్చారు. సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌లలో ఇన్వెస్ట్‌ చేశారు. సిప్‌(SIP)లు పెరగడంతో డీఐఐలు పెట్టుబడుల జోరు పెంచారు. గతేడాది సెప్టెంబర్‌నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఎఫ్‌ఐఐలు రూ. 2.06 లక్షల కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు మాత్రం దాదాపు అంతకు రెట్టింపు పరిమాణంలో అంటే రూ. 3.97 కోట్ల మేర స్టాక్స్‌(Stocks) కొనుగోలు చేసి మన మార్కెట్లలో భారీ పతనాన్ని అడ్డుకున్నారు.

Must Read
Related News