HomeUncategorizedgold price | డాలర్ నేల‌చూపులు.. పుత్త‌డి పైపైకి.. రూ.ల‌క్షకు చేరిన బంగారం

gold price | డాలర్ నేల‌చూపులు.. పుత్త‌డి పైపైకి.. రూ.ల‌క్షకు చేరిన బంగారం

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: gold price | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ US President Donald Trump ప్రారంభించిన వాణిజ్య యుద్ధంతో ప్ర‌పంచ మార్కెట్ల‌లో world markets తీవ్ర అనిశ్చితి నెల‌కొంది. ప్ర‌పంచాన్ని శాసించే డాల‌ర్ dollar నేల‌చూపులు చూస్తోంది. దీంతో ఇన్వెస్ట‌ర్లు investors సేఫ్‌గా భావించే పుత్త‌డి వైపు మొగ్గు చూపుతున్నారు. ఫ‌లితంగా బంగారం ధ‌ర‌లు gold prices భారీగా పెరుగుతున్నాయి. అమెరికన్ డాలర్ American dollar విలువ క్షీణిస్తుండ‌డం వ‌ల్లే ప‌సిడి ధర gold price రికార్డు స్థాయిలో దూసుక‌ళ్తోంది.

ఎన్న‌డు లేని రీతిలో మ‌న రిటైల్ మార్కెట్‌లో retail market ప‌ది గ్రాముల బంగారం gold రూ.ల‌క్ష మార్క్‌ను దాటింది. ట్రంప్ trump తెర తీసిన వాణిజ్య పోరుకు trade war తోడు వైట్‌హౌస్‌ White House, ఆ దేశ కేంద్ర బ్యాంక్ central bank ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ మ‌ధ్య త‌లెత్తిన వివాదాల కార‌ణంగా గ‌త గ‌త సోమవారం మార్కెట్‌లో market నాటకీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. డాల‌ర్ విలువ dollar value దారుణంగా ప‌డిపోయింది. వివిధ ప్రధాన కరెన్సీలతో డాలర్ పనితీరును సూచించే కీలకమైన ఐసీఈ యూఎస్ డాలర్ ఇండెక్స్ ICE US Dollar Index, మార్చి 2022 తర్వాత అత్యంత బలహీనమైన స్థాయికి క్షీణించింది. డాలర్ విలువలో ఈ క్షీణత ప్రపంచ రిజర్వ్ కరెన్సీ world’s reserve currency స్థిరత్వంపై విశ్వాసం సన్నగిల్లింద‌ని చెప్ప‌డానికి నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది.

gold price | ట్రంప్ వ‌చ్చాకే డాల‌ర్‌కు గండి..

అమెరికా అధ్య‌క్షుడిగా US President రెండోసారి బాధ్య‌త‌లు చేప‌ట్టిన ట్రంప్ ట్రేడ్ వార్‌కు trump trade war తెర తీశారు. అమెరికా america ఫ‌స్ట్ నినాదంతో ప్ర‌పంచ world దేశాల‌పై సుంకాలు tariffs పెంచారు. ప్ర‌ధానంగా అత్య‌ధిక దిగుమ‌తులు import చేసుకునే చైనాపై china ద‌శ‌ల వారీగా 245 శాతానికి పైగా టారిఫ్‌లు విధించారు. దీంతో అమెరికాలో america ధ‌ర‌లు పెరిగాయి. టారిఫ్‌ల tarrif పెంపు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు మంచిది కాద‌ని ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ చైర్మ‌న్ జెరోమ్ పావెల్ హెచ్చ‌రించారు. దీనిపై ఆగ్ర‌హానికి గురైన ట్రంప్ పావెల్‌పై నేరుగా విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు.

అలాగే, త‌క్ష‌ణ‌మే వ‌డ్డీ రేట్ల‌ను interest rates త‌గ్గించాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. దీంతో వైట్‌హౌస్‌, ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు రేగ‌డం డాల‌ర్‌పై ప్ర‌భావం చూపింది. అప్ప‌టికే సుంకాల పెంపుతో ప్రపంచ మార్కెట్‌లో global market అనిశ్చిత నెల‌కొన‌డంతో మ‌దుప‌రులు జాగ్ర‌త్త‌గా భావించే బంగారం వైపు మ‌ళ్లారు. అమెరికాలో బాండ్ రాబ‌డులు కూడా త‌గ్గ‌డంతో ఇన్వెస్ట‌ర్లు investors గోల్డ్ ఈటీఎఫ్‌ల కొనుగోలుకు మొగ్గ చూపారు. ఫెడ్ చైర్మ‌న్‌ను తొల‌గించే అంశాన్ని వైట్‌హౌస్ White House ప‌రిశీలిస్తోంద‌న్న వార్త‌లు. అదే స‌మ‌యంలో ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్‌ స్వాతంత్రానికి ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన, అమెరికా ఆస్తులపై US assets విస్తృతమైన అమ్మకాల ఒత్తిడికి దారితీసింది.

gold price | సుర‌క్షితమ‌నే భావ‌న‌తోనే..

ప్ర‌పంచ వ్యాప్తంగా మార్కెట్ల‌లో globel markets అనిశ్చిత నెల‌కొన్న త‌రుణంలో బంగారంపై పెట్టుబ‌డులు పెట్ట‌డం మంచిద‌నే అభిప్రాయంతో ఇన్వెస్ట‌ర్లు Investors గోల్డ్ ఈటీఎఫ్‌ల gold ETF కొనుగోలు చేస్తున్నారు. వాస్త‌వానికి స్టాక్ మార్కెట్లు stock markets, బాండ్లు, క్రిప్టో crypto వంటి వాటిలో పెట్టుబ‌డులు అంత సుర‌క్షితం కావు. ప్ర‌పంచంలో world జ‌రిగే ప‌రిణామాల ఆధారంగా వాటిలో హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటున్నాయి. క‌రోనా carona లాంటి మ‌హ‌మ్మారి వ్యాప్తి చెంద‌డం, దేశాల మ‌ధ్య యుద్ధాలు జ‌ర‌గ‌డం వంటి స‌మ‌యాల్లో మార్కెట్లు ప‌డిపోవ‌డం స‌హ‌జం. కానీ, పుత్త‌డి gold విష‌యంలో అలా జ‌రుగ‌దు.

బంగారంపై gold పెట్టే పెట్టుబ‌డి అత్యంత సుర‌క్షితం కావ‌డంతో ఇన్వెస్ట‌ర్లు Investors.. అనిశ్చితి స‌మ‌యంలో పుత్త‌డి కొనుగోలుకు ముందుకొస్తుంటారు. ప్ర‌స్తుతం పెరిగిన రాజకీయ, భౌగోళిక ఆర్థిక political and geopolitical అనిశ్చితి మధ్య ఇన్వెస్ట‌ర్లు Investors స్టాక్‌మార్కెట్‌లో stock markets త‌మ పెట్టుబ‌డుల‌ను వెన‌క్కి తీసుకుంటూ, సంప్రదాయ సురక్షిత పెట్టుబడి సాధనాల వైపు మళ్లించారు. దీంతో పుత్త‌డి ధ‌ర ఆకాశ‌న్నంటుతోంది. అయితే, మ‌రింత ధ‌ర price పెరుగుతంద‌ని ఇప్పుడు బంగారం కొన‌డం స‌రికాద‌ని నిపుణులు చెబుతున్నారు. ప్ర‌స్తుత అనిశ్చిత సుదీర్ఘ‌కాలం కొన‌సాగ‌ద‌ని, రాబోయే రోజుల్లో మార్కెట్లు మ‌ళ్లీ పుంజుకుంటే ప‌సిడి ధ‌ర‌లు gold prices కాస్త త‌గ్గుతాయ‌ని సూచిస్తున్నారు.