National Human Rights Commission| వృద్ధురాలిని చంపి తిన్న కుక్కలు.. కలెక్టర్​ నిర్లక్ష్యపు నివేదిక.. హ్యూమన్​ రైట్స్ కమిషన్​ సీరియస్​
National Human Rights Commission| వృద్ధురాలిని చంపి తిన్న కుక్కలు.. కలెక్టర్​ నిర్లక్ష్యపు నివేదిక.. హ్యూమన్​ రైట్స్ కమిషన్​ సీరియస్​

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: National Human Rights Commission : రాజన్న సిరిసిల్ల(Rajanna Siricilla) జిల్లా కలెక్టర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. తమ అధికారాలను వినియోగించి వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యేలా చేస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Collector Sandeep Kumar Jha) పై కమిషనర్​ ఆగ్రహం వ్యక్తం చేసింది.

గత సంవత్సరం ఆగస్టు 2వ తేదీన అనారోగ్యంతో మంచంపై పడి ఉన్న వృద్ధురాలు పిట్ట రామలక్ష్మీ(78) ని వీధి కుక్కలు చంపి తినేశాయి. ఈ విషయంపై న్యాయవాది ఇమ్మనేని రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి, పూర్తి నివేదిక ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ను మానవ హక్కుల కమిషన్ కోరింది.

కాగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమర్పించిన నివేదిక నిర్లక్ష్యపూరితంగా ఉందని, అతను ఇచ్చిన నివేదిక విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర స్థాయిలో మండిపడింది.