అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Viral Video | కుక్కలు మనకు నిజమైన మిత్రులని ఎప్పుడూ నిరూపించుకుంటూనే ఉంటాయి. అవి చూపే విశ్వాసం, బుద్ధి, చాకచక్యం ఎన్నో సందర్భాల్లో మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. తాజాగా ఒక తెలివైన కుక్క తన స్నేహితుడిని నీటి ప్రమాదం నుంచి ఎలా కాపాడిందో చూపించే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతున్న వీడియో(Viral Video)లో ఒక కుక్క నీటిలో పడిపోయిన మరో కుక్కను గమనిస్తుంది. నీటిలో పడిపోయిన కుక్క బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఇది గమనించిన మరో కుక్క(Dog) తక్షణమే స్పందించి దానికి సహాయం అందించేందుకు ప్లాన్ వేస్తుంది.
Viral Video | స్నేహమంటే ఇదేరా..
ఇంతలో దూరంగా ఒక టైరు కనిపిస్తుంది. దాన్ని తన నోటితో పట్టుకుని నీటి వద్దకు తీసుకువచ్చి వేరే కుక్కకి అందిస్తుంది.. నీటిలో ఉన్న కుక్క ఆ టైర్‌ను పట్టుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే నీటిలో ఉన్న కుక్క టైర్‌ని (Tire Help) నోటితో బలంగా పట్టుకోగా, ఒడ్డున ఉన్న కుక్క టైర్‌ను బలంగా లాగే ప్రయత్నం చేస్తుంది. మొదటి రెండు ప్రయత్నాలు విఫలమైనా, చివరికి మూడోసారి గట్టిగా లాగి నీటిలో ఉన్న స్నేహితుడిని పైకి తీసి రక్షిస్తుంది. ఈ సాహసోపేతమైన చర్య చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే 2.2 మిలియన్లకు పైగా వ్యూస్, 45 వేలకుపైగా లైక్స్ సొంతం చేసుకుంది. నెటిజన్లు ఈ ఘటనపై అనేక రకాలుగా స్పందిస్తున్నారు.
ఈ కుక్క చాలా తెలివి గలది. మనుషులకంటే ఇవి మంచి స్నేహితులు. స్నేహం అంటే ఇదే.. వీటిని చూసిన నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు మనకు మానవత్వం గురించి, అచంచలమైన విశ్వాసం గురించి చాలా నేర్పుతుంటాయి. కుక్కలు మనుషుల ప్రాణాలను కాపాడిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
This shows how smart dogs are pic.twitter.com/K3ZjtOdarn
— Puppies 🐶 (@PuppiesIover) July 23, 2025
