అక్షరటుడే, బాన్సువాడ: Birkur | బీర్కూర్ మండల కేంద్రంలో కుక్కల బెడదను నివారించాలని బీజేపీ నాయకులు(Bjp Birkur) డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం తహశీల్దార్ భుజంగరావుకు వారు వినతిపత్రం ఇచ్చారు. పట్టణంలో రోజురోజుకూ వీధికుక్కల (Street Dogs) సంఖ్య పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
Birkur | పిల్లలు, వృద్ధులపై దాడులు
ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. చిన్నారులను ఎక్కువగా గాయపరుస్తున్నాయని (Dog Bites) వాటిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన ప్రణాళిక వేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కార్యదర్శి యోగి, ఉపాధ్యక్షుడు వడ్ల బస్వరాజ్, సీనియర్ నాయకులు బీరుగొండ, గజేందర్, జగదీశ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.