అక్షరటుడే, వెబ్‌డెస్క్: Actor Salman Khan | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించి కొన్ని బోల్డ్ కామెంట్స్ చేసి అందరు ఉలిక్కిపడేలా చేశారు. వయసు 50 దాటిపోయినా ఇప్పటికీ పెళ్లి గురించి ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం పలు ఊహాగానాలకు దారితీస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్‌కు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నాయనే ప్రచారం జోరందుకుంది. అందుకే ఆయన ఇప్పటి వరకు పెళ్లికి దూరంగా ఉన్నారని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి.. రీసెంట్గా ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’కు (The Great Indian Kapil Show) సల్మాన్ ఖాన్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా సల్మాన్ తన జీవితంలో ఇటివల ఎదురైన అనారోగ్య సమస్యలను చెప్పుకొచ్చాడు.
Actor Salman Khan | ఇన్ని అనారోగ్యాలా..
‘సినిమాల్లో చాలాసార్లు నా ఎముకలు, పక్కటెముకలు విరిగిపోయాయి, ట్రైజెమినల్ న్యూరల్జియా (Trigeminal neuralgia) ఉన్నప్పటికీ నేను పనిచేస్తున్నాను. నాకు మెదడు Brainలో అనూరిజం (Aneurysm) ఉంది. రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లమ్ కూడా AV మాల్ ఫార్మేషన్ (AV mall formation) ఉంది. అయినా నేను ఇంకా పనిచేస్తున్నాను’ అని సల్మాన్ చేసిన కామెంట్స్ అందరికీ షాక్ ఇచ్చాయి. సినిమాల్లో యాక్షన్ చేయడం వల్ల అనేకసార్లు పక్కటెముకలు విరిగిపోవడం జరిగింది. ఇలా కావడంతో శరీరానికి గాయాలయ్యాయని దీంతో ఆరోగ్య సమస్యలు వస్తాయని సల్మాన్‌ఖాన్ పేర్కొన్నాడు. అయితే అది తన జీవితంలో భాగమయ్యిందని, తనకు ఇవన్నీ అలవాటయ్యాయని ఆయన అన్నారు.