అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తులను (Waqf properties) బీసీలకు పంచే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రశ్నించారు.
శాసనసభలో (Assembly) ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ (BC Reservation) బిల్లుపై ఎమ్మెల్యే ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్ (Assembly Media Point) వద్ద మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన బీసీ కులగణన లెక్కలు తప్పులతడకగా ఉన్నాయని దుయ్యబట్టారు.
ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం హిందూ బీసీలు 46.25 శాతం అని ముస్లిం బీసీలు 10.8 శాతం అని తేల్చి.. ముస్లింలను బీసీల్లో కలిపే ప్రయత్నం చేస్తోందన్నారు. బీసీ రిజర్వేషన్లను ముస్లింలకు పంచిపెట్టే రేవంత్ సర్కారు, ముస్లింల వక్ఫ్ భూములను బీసీలకు పంచాలని డిమాండ్ చేశారు. ఇది బీసీ డిక్లరేషన్ బిల్ కాదని, ముస్లిం రిజర్వేషన్ బిల్ అని వ్యాఖ్యానించారు. మతం ఆధారంగా ఇచ్చే రిజర్వేషన్లను తాము ఎప్పటికీ అంగీకరించబోమని స్పష్టం చేశారు. 42 శాతం మొత్తం రిజర్వేషన్లు బీసీలకే రావాలని డిమాండ్ చేశారు.