- Advertisement -
Homeతాజావార్తలుDoctors Suspended | మెడికల్ కౌన్సిల్ సంచలన నిర్ణయం.. ఆర్​ఎంపీలను ప్రోత్సహించే వైద్యులపై వేటు..! ​

Doctors Suspended | మెడికల్ కౌన్సిల్ సంచలన నిర్ణయం.. ఆర్​ఎంపీలను ప్రోత్సహించే వైద్యులపై వేటు..! ​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Doctors Suspended | రాష్ట్రంలోని పలువురు క్వాలిఫైడ్​ డాక్టర్లపై తెలంగాణ మెడికల్​ కౌన్సిల్​ (Telangana Medical Council) చర్యలు చేపట్టింది. ఆర్​ఎంపీ, పీఎంపీలకు కమీషన్​ ఇచ్చి ప్రోత్సహిస్తున్న వైద్యులను సస్పెండ్​ చేసింది.

తెలంగాణ మెడికల్ కౌన్సిల్ Telangana Medical Council, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (Indian Medical Council) (ప్రొఫెషనల్ కండక్ట్, ఎటిక్వేట్ అండ్ ఎథిక్స్) రెగ్యులేషన్స్, 2002, తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1968 ప్రకారం, వృత్తిపరమైన దుష్ప్రవర్తన, నైతిక ఉల్లంఘనలకు సంబంధించి పలువురు వైద్యులపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.

- Advertisement -

Doctors Suspended | ఎవరిపై చర్యలు అంటే..

హైదరాబాద్ నగరంలోని (Hyderabad city) ఈసీఐఎల్ ఆక్సికేర్​ హాస్పిటల్​ మెడికల్​ డైరెక్టర్​ డాక్టర్ ఎ. చైతన్య రెడ్డిని ఆరు నెలల పాటు సస్పెండ్​ చేస్తూ కౌన్సిల్​ నిర్ణయం తీసుకుంది.

భువనగిరిలో జరిగిన క్వాక్స్ ఈవెంట్‌లో అర్హత లేని ప్రాక్టీషనర్లకు ఆయన స్పాన్సర్ చేయడం, వారితో సహవాసం చేయడంతో చర్యలు చేపట్టింది.

కొత్తపేటలోని ఓమ్ని హాస్పిటల్​ మెడికల్ డైరెక్టర్​ డాక్టర్ గౌతమ్ రెడ్డిపై సైతం ఆరు నెలల పాటు వేటు వేసింది. భువనగిరిలో జరిగిన సమావేశంలో ఆయన ఆస్పత్రి తరఫున స్పాన్సర్​షిప్​ చేశారు.

వనస్థలిపురంలోని ఈవ్య హాస్పిటల్స్ మెడికల్​ డైరెక్టర్​ కేవీ మల్లికార్జున్​ రావు (K.V. Mallikarjuna Rao) అర్హత లేని ప్రాక్టీషనర్లతో ఒక ఈవెంట్‌ను స్పాన్సర్ చేశారు. దీంతో ఆయన 6 నెలల పాటు సస్పెండ్​కు గురయ్యారు.

సరైన అర్హతలు లేకున్నా.. కాస్మోటాలజిస్ట్/హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా తనను తాను తప్పుగా చూపించుకున్నందుకు డాక్టర్ కన్నయ్య తాళ్లపల్లి (లివ్యౌంగ్ క్లినిక్, జూబ్లీ హిల్స్) పై సంవత్సరం పాటు సస్పెన్షన్ విధించారు.

గుర్తించబడని వైద్య అర్హతలను ప్రదర్శించినందుకు సంగారెడ్డిలోని (Sangareddy) పద్మావతి న్యూరో, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్​ డాక్టర్​ కె. ఉమా మహేశ్వర్ 6 నెలల సస్పెన్షన్​కు గురయ్యారు.

ఈ ఐదుగురు వైద్యులు 10 రోజుల్లోపు తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను అప్పగించాలని కౌన్సిల్​ ఆదేశించింది. లేదంటే వారి పేర్లను మెడికల్ రిజిస్టర్ నుంచి శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించింది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News