అక్షరటుడే, భీమ్‌గల్: Additional Collector Ankit | ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు. భీమ్‌గల్ (Bheemgal) పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(Primary health center) ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Additional Collector Ankit | పీహెచ్సీ ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలి..
ఆరోగ్య కేంద్రం పరిసర ప్రాంతాలను సబ్‌కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఆవరణలో పిచ్చిమొక్కలను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. పీహెచ్సీలో (PHC) అన్నిరకాల మందులు అందుబాటులో ఉన్నాయో లేదా అనే విషయాలను ఫార్మసిస్ట్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీవో సంతోష్ కుమార్ డాక్టర్ అజయ్ పవార్, సిబ్బంది ఉన్నారు.