అక్షరటుడే, కామారెడ్డి: Collector Kamareddy | సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) వైద్య సిబ్బందికి సూచించారు. ఆయన మాచారెడ్డి (machareddy) ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పాల్వంచ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను (Ayushman Health Centers) సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. వైద్యుల హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న మందుల గురించి ఆరా తీశారు. ప్రజలకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి ఆస్పత్రిలో అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వోను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, డిప్యూటీ డీఎంహెచ్వో ప్రభు కిరణ్, మండల ప్రత్యేక అధికారి, రెవెన్యూ అధికారులున్నారు.