అక్షరటుడే, వెబ్డెస్క్ : Uttarpradesh | ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. హాపూర్ జిల్లా దేవ్ నందిని ఆసుపత్రి(Dev Nandini Hospital)లో డాక్టర్లు ఒక 35ఏళ్ల యువకుడి కడుపులో నుంచి 29 చెంచాలు, 19 టూత్‌బ్రష్‌లు, 2 పెన్నులు బయటకు తీసారు. ఈ ఘటన నెట్టింట్లో వైరల్‌గా మారింది.
బులంద్ షహర్(Buland Shahar)కు చెందిన సచిన్ అనే యువకుడు గత కొంత కాలంగా మత్తు పదార్థాలకు బానిసగా మారాడు. ఈ కారణంగా అతడి కుటుంబ సభ్యులు అతనిని రిహాబిలిటేషన్ సెంటర్(Rehabilitation Center)లో చేర్చారు. అయితే అక్కడికి పంపినందుకు కోపంతో , అందుబాటులో ఉన్న చెంచాలు, బ్రష్‌లు, పెన్నులు వంటి వస్తువులను అతను మింగడం ప్రారంభించాడు.
Uttarpradesh | కడుపా లేకుంటే..
ఈ పరిస్థితుల్లో అతనికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చి, పరిస్థితి విషమించడంతో తక్షణమే అతన్ని హాపూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అల్ట్రాసౌండ్, ఎక్స్-రే వంటి పరీక్షలలో అతని కడుపులో భారీగా వస్తువులు ఉన్నట్లు గుర్తించి వైద్యులు ఆశ్చర్యపోయారు.డాక్టర్ శ్యామ్ కుమార్ నేతృత్వంలోని వైద్య బృందం అత్యవసరంగా శస్త్రచికిత్స చేపట్టి, సుమారు మూడున్నర గంటల పాటు శ్రమించి, ఒకటి తర్వాత ఒకటి మొత్తం 50 వస్తువులను సురక్షితంగా బయటకు తీశారు. ఈ అసాధారణమైన ప్రవర్తన వెనుక మానసిక అస్థిరత ఉందని వైద్యులు తెలిపారు. ఇలాంటి ప్రవర్తన కోపం, ఒత్తిడి, అసహనంతో పాటు తీవ్రమైన మానసిక అనారోగ్యాల లక్షణంగా ఉంటుంది.
రిహాబ్ సెంటర్‌లలో చికిత్స పొందుతున్న కొంతమందిలో ఇలాంటి సంఘటనలు కనిపిస్తూనే ఉంటాయి అని డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం సచిన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, పూర్తి చికిత్స అనంతరం అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్టు డాక్టర్లు తెలిపారు. అయితే, అతడికి మానసిక చికిత్స ఇంకా కొనసాగుతుందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. ‘‘ఇది నిజమేనా?’’, ‘‘అన్ని మింగడం సాధ్యమా?’’ అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైద్యులు సక్సెస్ ఫుల్‌గా ఆపరేషన్ చేసి యువకుడిని బ్రతికించిన క్రమంలో వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.