అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cough Syrup | దేశవ్యాప్తంగా పిల్లలకు ఇచ్చే దగ్గు మందు(Cough Syrup) వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కల్తీ దగ్గు మందు సేవించి పన్నెండు మంది చిన్నారులు మరణించిన ఘటన దేశాన్ని కుదిపేసింది.
ఈ నేపథ్యంలో ఆ మందు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోకి వచ్చిందా అనే అనుమానాలపై రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్(Satyakumar Yadav)మాట్లాడుతూ.. ఆ ప్రమాదకరమైన దగ్గు మందు ఏపీకి సరఫరా కాలేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని క్లారిటీ ఇచ్చారు. మంత్రికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వీరపాండియన్ , ఔషధ నియంత్రణ పరిపాలనా ఇంఛార్జ్ డైరెక్టర్ జనరల్, అలాగే ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ గిరీశ్ నివేదికలు అందించారు.
Cough Syrup | వారికి ఇవ్వొద్దు..
కేంద్ర ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ సూచనల మేరకు, రెండేళ్లలోపు పిల్లలకు దగ్గు, జలుబు మందులు ఇవ్వవద్దని వైద్యులకు ఆదేశాలు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్ ఇన్స్పెక్టర్లు సోమవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ‘కోల్ర్డిఫ్’ అనే కల్తీ మందు ఎక్కడా కనిపించలేదని అధికారులు తెలిపారు. ఏ మెడికల్ షాప్‌కీ, ప్రభుత్వ ఆసుపత్రికీ ఈ మందు సరఫరా కాలేదని స్పష్టం చేశారు. ఇదిలావుంటే, గుంటూరు జిల్లా తురకపాలెం బీసీ కాలనీకి చెందిన చల్లా కృష్ణవేణి (35) మెలియాయిడోసిస్ వ్యాధితో ఆదివారం మరణించారు. ఈ ఘటనపై కమిషనర్ వీరపాండియన్(Commissioner Veerapandian) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోగి పది రోజులుగా ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందినా సరైన ఫాలోఅప్ లేకపోవడంపై ఆయన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ప్రశ్నించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా , డీఎంహెచ్‌వో డాక్టర్ కె.విజయలక్ష్మీ లతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్న కమిషనర్, తురకపాలెం పరిసర పరిస్థితులపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. మెలియాయిడోసిస్ అంటే అది ఒక రకమైన బాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధి. ఇది నేల లేదా నీటి ద్వారా చర్మ గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశించి, ఊపిరితిత్తులు, కాలేయం వంటి అవయవాలకు వ్యాపిస్తుంది. సరైన సమయంలో చికిత్స అందించకపోతే ఈ వ్యాధి ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంటుంది.
2 comments
[…] దీంతో రాష్ట్రంలో రెండు దగ్గు మందు(Cough Syrup)లను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు […]
[…] దగ్గుమందు(Cough Syrup) వికటించి చిన్నారులు మృతి చెందిన కేసుకు సంబంధించి శ్రీసన్ ఫార్మా యజమాని జి రంగనాథన్‌ను అరెస్టు చేసిన కొన్ని రోజుల తర్వాత ఈడీ దాడులు చోటు చేసుకున్నాయి. కోల్డ్ రిఫ్ దగ్గు సిరప్ కేసులో PMLA కింద శ్రీసన్ ఫార్మా(Srisan Pharma)తో సంబంధం ఉన్న చెన్నైలోని ఏడు ప్రాంగణాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. అలాగే, తమిళనాడు డ్రగ్ కంట్రోల్ ఆఫీస్ ఉన్నతాధికారుల నివాసాలపైనా దాడులు చేసింది. […]
Comments are closed.