అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | వైద్యుల నిర్లక్ష్యంతో తల్లీబిడ్డ మృతి చెందిన ఘటన హైదరాబాద్(Hyderabad)లో చోటు చేసుకుంది. జగద్గిరిగుట్టకు చెందిన గర్భిణి అరుణ(22)ను ప్రసవం కోసం బాలానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య (Balanagar UPHC) కేంద్రానికి తీసుకొచ్చారు. వైద్య సిబ్బంది డెలివరీ చేయగా మగ బిడ్డ పుట్టాడు. కొద్దిసేపటికే చిన్నారి స్పందించడం లేదని సిబ్బంది నిలోఫర్‌కు రిఫర్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు శిశువును తీసుకొని నిలోఫర్ ఆస్పత్రి (Nilofar Hospital)కి వెళ్లారు. అయితే అంతలోనే అరుణ స్పృహ కోల్పోయింది. ముందుగా ఆమె స్పృహ కోల్పోయిన విషయాన్ని వైద్య సిబ్బంది గమనించలేదు. తీరా చూసేలోపు ఆమె పరిస్థితి విషమించింది. వెంటనే అరుణను గాంధీకి తీసుకు వెళ్లాలని సూచించారు. ఆమెను గాంధీ ఆస్పత్రి (Gandhi Hospital)కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మరోవైపు శిశువు సైతం నిలోఫర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వైద్యులు నిర్లక్ష్యంతోనే తల్లీబిడ్డ మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
