అక్షరటుడే, డిచ్పల్లి: Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో ఆంగ్ల విభాగంలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న గోల్డి బల్బీర్ కౌర్ డాక్టరేట్ సాధించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో (Kakatiya University) రిటైర్డ్ ప్రొఫెసర్ వి.శ్రీనివాస్ పర్యవేక్షణలో ‘ద ఇమేజ్ ఆఫ్ న్యూ వుమెన్ స్టడీ ఆఫ్ శోభాడే సెలక్ట్ నావెల్స్’ అనే అంశంపై ఆమె పరిశోధన చేశారు.
వర్సిటీలో మంగళవారం జరిగిన మౌఖిక పరీక్షకు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్‌గా ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీకి (Foreign Languages University) చెందిన ప్రొఫెసర్ జి.తిరుపతి కుమార్ ఆన్లైన్లో హాజరయ్యారు. పరిశోధకురాలు గోల్ది బల్బీర్ పరిశోధించి విశ్వవిద్యాలయానికి సమర్పించిన సిద్ధాంత గ్రంథంలో అభ్యుదయ స్త్రీవాదం, లింగ సమానత్వం, కుటుంబ ఆర్థిక రాజకీయ స్వావలంబనపై సమగ్రంగా విశ్లేషణ ఉందని ఆయన పేర్కొన్నారు. ఆమె పరిశోధన సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని పరిశోధకురాలిని ఆయన అభినందించారు. ఈ మౌఖిక పరీక్షకు డీన్ ప్రొఫెసర్ లావణ్య, విభాగాధిపతి డాక్టర్ కేవీ రమణా చారి, ఛైర్పర్సన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ పి.సమత, ఎల్ జోత్స్న, ఎన్ స్వామి రావు, విద్యార్థులు పాల్గొన్నారు.
