Homeక్రైంNizamabad | మహిళను వేధిస్తున్న డాక్టర్​, రియల్ ఎస్టేట్​​ వ్యాపారి.. సీపీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు

Nizamabad | మహిళను వేధిస్తున్న డాక్టర్​, రియల్ ఎస్టేట్​​ వ్యాపారి.. సీపీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు

నగరంలోని ఓ ప్రముఖ డెంటల్​ వైద్యుడు, రియల్​ ఎస్టేట్​ వ్యాపారి ఓ మహిళను వేధిస్తున్నారు. దీంతో ఆమె సోమవారం సీపీ సాయిచైతన్యకు ఫిర్యాదు చేసింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | మహిళలకు రక్షణ లేకుండా పోయింది. వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఓ ప్రముఖ డెంటల్​ డాక్టర్​, ‘ఆయిల్’ పేరిట పేరు గల రియల్​ ఎస్టేట్​ వ్యాపారి ఓ మహిళపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ ఘటన నిజామాబాద్​లో చోటు చేసుకుంది. డాక్టర్​, వ్యాపారి తనకు వీడియో కాల్స్​ చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని బాధితురాలు వాపోయింది.

ప్రముఖ డెంటల్ వైద్యుడు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తనకు ఫోన్​ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని సదరు మహిళ సీపీ సాయి చైతన్యకు ఫిర్యాదు చేసింది. సదరు మహిళ ఓ ప్రైవేట్​ సంస్థలో పని చేసేది. అయితే వారి వేధింపులు తాళలేక రెండేళ్ల క్రితం జాబ్​ మానేసింది. అయినా తరుచూ ఫోన్లు చేసి వేధిస్తున్నారని ఆమె వాపోయింది. వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో స్పందించిన సీపీ వారిపై కేసు నమోదు చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్​కు సిఫార్సు చేసినట్లు సమాచారం.

కాగా సదరు యువతి వివాహనికి ముందు ఓ ప్రైవేట్​ సంస్థలో రిసెప్షనిస్ట్​గా పని చేసేది. ఆ సమయంలో ఆ సంస్థ యజమాని బావమరిది, వ్యాపారి ఆమె ఫోన్​ నంబర్​ తీసుకొని మాట్లాడేవారు. అనంతరం ఓ డెంటల్​ డాక్టర్​ సైతం ఆ సంస్థలో పని నిమిత్తం వచ్చి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. యువతికి పెళ్లయన తర్వాత జాబ్​ మానేసింది. అయినా కూడా వారు ఫోన్​ చేసి వేధింపులకు పాల్పడుతున్నారు. న్యూడ్​ కాల్​ చేస్తే రూ.5 వేలు, గెస్ట్​ హౌజ్​కు వస్తే రూ.10 వేలు ఇస్తామని ఫోన్లు చేసి వేధిస్తున్నారని బాధితురాలు వాపోయింది. సోమవారం ప్రజావాణిలో ఆమె సీపీకి ఫిర్యాదు చేశారు.