అక్షరటుడే, హైదరాబాద్ : Workouts | శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి జిమ్(Gym)కు వెళ్లడం, వ్యాయామం చేయడం చాలా మంచిది. అయితే, ఈ సమయంలో మనం ఎంచుకునే దుస్తులు కూడా అంతే ముఖ్యం. చాలామంది స్టైలిష్‌గా కనిపించడానికి బిగుతుగా ఉండే దుస్తులు ధరిస్తారు. కానీ, ఇవి మన శరీరానికి సౌకర్యంగా అనిపించినా, ఆరోగ్యానికి హానికరం. ఈ బిగుతు దుస్తుల(Tight Clothes) వల్ల కలిగే నష్టాలు చాలానే ఉన్నాయి.
Workouts | రక్త ప్రసరణలో అడ్డంకులు
బిగుతుగా ఉండే వ్యాయామ దుస్తులు(Workout Clothes) ముఖ్యంగా నడుము, కాళ్లు, చేతుల దగ్గర రక్తనాళాలపై ఒత్తిడిని పెంచుతాయి. దీనివల్ల రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి, కండరాలకు తగినంత ఆక్సిజన్ అందదు. దీంతో కండరాల పనితీరు తగ్గి, త్వరగా అలసిపోతారు. దీర్ఘకాలంలో ఇది నరాల సమస్యలకు కూడా దారితీయవచ్చు.
Workouts | చర్మం, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల ముప్పు
వ్యాయామం చేసేటప్పుడు ఎక్కువ చెమట పడుతుంది. బిగుతు దుస్తులు ఆ చెమటను పీల్చుకోకుండా, చర్మానికి అతుక్కుపోతాయి. దీనివల్ల చర్మం సరిగా గాలి ఆడక, తేమ పేరుకుపోతుంది. ఈ తేమతో బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగి చర్మంపై దద్దుర్లు, దురద, ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. మహిళల్లో అయితే, ఈ తేమ వల్ల యోని ప్రాంతంలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
Workouts | శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో సమస్యలు
బిగుతుగా ఉండే దుస్తులు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి, ముఖ్యంగా వేసవిలో ఇది మరింత ఇబ్బందికరంగా మారుతుంది. శరీరం నుంచి వేడి సరిగా బయటకు వెళ్లకపోవడం వల్ల హీట్ ఎగ్జాషన్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అంతేకాదు, బిగుతు ప్యాంట్లు నరాలపై ఒత్తిడి కలిగించడం వల్ల తిమ్మిర్లు, నొప్పి వంటివి కూడా రావచ్చు.
Workouts | ఏం ధరించాలి?
ఈ సమస్యల నుంచి బయటపడాలంటే, వ్యాయామం(Exercise Tips) చేసేటప్పుడు వదులుగా ఉండే, గాలి ఆడే దుస్తులు ధరించడం మంచిది. కాటన్ లేదా తేమను పీల్చుకునే మైక్రోఫైబర్ వంటి పదార్థాలతో చేసిన దుస్తులను ఎంచుకోండి. సరైన దుస్తులు మీ ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు, వ్యాయామ సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి.