Anti Aging | మీ యవ్వనం మీకు తిరిగి కావాలా.. అయితే ఈ 47 ఏళ్ల నవ యువకుడి గురించి తెలుసుకోవాల్సిందే!
Anti Aging | మీ యవ్వనం మీకు తిరిగి కావాలా.. అయితే ఈ 47 ఏళ్ల నవ యువకుడి గురించి తెలుసుకోవాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Anti Aging : కాలిఫోర్నియా(California)కు చెందిన 47 ఏళ్ల బ్రియన్ జాన్సన్‌(Brian Johnson) ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలనే కోరికతో నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నాడు. 18 ఏళ్ల యువకుడిగా మారేందుకు తన శరీరంపై అనేక ప్రయోగాలు చేయిస్తున్నాడు. ఇందు కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు వెచ్చిస్తున్నాడు.

Anti Aging : శరీరంలో మార్పులు..

ఆలివర్ జోల్మాన్(Oliver Zolman) అనే వైద్యుడితో పాటు మరికొంత మంది బ్రియన్ జాన్సన్‌కు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయనపై వైద్యులు చేసిన ప్రయోగాల వల్ల శరీర బలం, ఊపిరితిత్తుల సామర్థ్యం 18 ఏళ్ల వయసులోకి మారాయి. గుండె పనితీరు 37 ఏళ్ల వ్యక్తి స్థాయికి చేరింది. చర్మం నిగారింపు 28 ఏళ్ల యువకుడికి ఉండే మాదిరి మారింది.

కాగా, బ్రియన్ జాన్సన్ తాజాగా తన శరీరంలోని రక్తం నుంచి ప్లాస్మాను పూర్తిగా తొలగించుకున్నాడు. రక్తంలో 40 నుంచి 55 శాతం ఉండే ప్లాస్మాను తొలగించడం ప్రమాదకరమైనా.. దానిని పూర్తిగా తొలగించి, దాని స్థానంలో ఆల్బుమిన్, ఐవీఐజీ ద్రవాలను ఎక్కించుకున్నాడు.

Anti Aging : ఏమిటీ ఈ ప్లాస్మా(Plasma) ?

ప్లాస్మా(Plasma) అనేది రక్తంలో ఒక భాగంగా ఉండే లేత పసుపు రంగు ద్రవం. రక్తంలోని కణాలు, ఇతర పదార్థాలను ఈ ప్లాస్మా శరీరంలోని ఆయా భాగాలకు సరఫరా చేస్తుంది. ప్లాస్మాలో ఎక్కువ భాగం నీరు, యాంటీబాడీలు, ప్రోటీన్లు, లవణాలు, ఎంజైమ్‌లు భాగంగా ఉంటాయి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తికి, రక్తం గడ్డకట్టే ప్రక్రియకు తోడ్పడుతుంది.

ప్లాస్మా స్థానంలో బ్రియన్ జాన్సన్ ఎక్కించుకున్న ఆల్బుమిన్ అనేది ప్లాస్మాలో ఉండే అతి ముఖ్యమైన ప్రొటీన్. ఇది శరీరంలోని వివిధ భాగాలకు హార్మోన్లు, మందుల వంటి వాటిని చేరవేయడానికి, కిడ్నీ, లివర్ పనితీరుకు సాయపడుతుంది. ఐవీఐజీ అనేది రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలను కలిగి ఉన్న ద్రవం.

బ్రియన్ జాన్సన్ గతంలో తన కుమారుడి ప్లాస్మాను ఆయన శరీరంలోకి ఎక్కించుకున్నాడు. ఇప్పుడు దానిని తొలగించి ఆల్బుమిన్(Albumin), ఐవీఐజీ(IVIG) ద్రవాలను బాడీలోకి ఎక్కించుకున్నాడు.

Anti Aging : భారీగానే ఖర్చు..

ఒకప్పుడు పేమెంట్ ప్రాసెసింగ్ కంపెనీ(payment processing company)ని నిర్వహించిన బ్రియన్ జాన్సన్.. దానిని విక్రయించాడు. ఆ తర్వాత తన యవ్వనాన్ని తిరిగి పొందే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ప్రస్తుతం తన శరీరంపై చేసే ప్రయోగాల కోసం ప్రతి సంవత్సరం సుమారు రూ. 17 కోట్లకు పైగా వెచ్చిస్తున్నాడు.