అక్షరటుడే, బోధన్ : Bodhan | ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన ఓ అధికారి(Officer) నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. నీళ్లు రావడం లేదని ఫోన్ చేస్తే నాకేందుకు చేశావని ఓ వ్యక్తిని బెదించాడు. బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్(Shakkarnagar)లో రెండు రోజులుగా నీరు రావడం లేదు. దీంతో స్థానికంగా ఉండే ఓ వ్యక్తి తమ సమస్య చెప్పుకోవడానికి మున్సిపల్ ఏఈ(Municipal AE) శ్రీనివాస్‌కు ఫోన్ చేశాడు. దీంతో సదరు అధికారి పొంతన లేని సమాధానం చెప్పాడు. అంతేగాకుండా తనకు ఎందుకు ఫోన్ చేశావని ప్రశ్నించడం గమనార్హం. ‘‘నేను ఎవరో తెలుసా’’ అంటూ.. ఫోన్ చేసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అధికారే ఇలా మాట్లాడితే ఎలా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు ఇంకా ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు.
Bodhan | నేనెవరో తెలుసా.. నీరు రావడం లేదని ఫోన్ చేసిన వ్యక్తిపై ఏఈ ఆగ్రహం
Published on
