అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kantara Movie | కన్నడ ఇండస్ట్రీని ఊపేసిన చిత్రం ‘కాంతారా’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి (Director Rishab Shetty) నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది.
ఇప్పుడు అదే సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. కాంతారాను మొదటగా రిషబ్ శెట్టి.. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో (Jr. NTR) చేయాలని అనుకున్నాడట. తారక్‌కు మంచి అభిమాని అయిన రిషబ్, తారక్‌ను హీరోగా ఊహించి కథను తయారుచేశాడని సమాచారం. అంతేకాకుండా, ఎన్టీఆర్‌ను స్వయంగా కలిసి కథను వినిపించాడట.
కథ విన్న జూనియర్ ఎన్టీఆర్‌కి స్క్రిప్ట్ ఎంతో నచ్చిందని, బాగా ఇష్టపడినప్పటికీ, అప్పటికే ‘RRR’ షూటింగ్‌లో బిజీగా ఉండడం, ఆ తర్వాత ‘దేవర’ సినిమా కమిట్ కావడం వల్ల డేట్స్ ఖాళీ లేక కాంతారా ప్రాజెక్ట్‌ను చేయలేకపోయాడట. దీంతో రిషబ్ శెట్టి తన కథలో తనే హీరోగా నటించి సినిమా తెరకెక్కించాడు. ఈ చిత్రం విడుదలైన వెంటనే బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా వచ్చిన ప్రీక్వెల్ ‘కాంతారా చాప్టర్ 1’ (Kantara Chapter 1) కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తూ రికార్డులు తిరగరాస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్‌ను దాటడం గమనార్హం.
ఈ వార్త నిజమే అయి.. ఒకవేళ ఎన్టీఆర్ కాంతారాలో (Kantara Movie) నటించి ఉంటే, ఆ సినిమాకు మరింత విస్తృతమైన పాన్ ఇండియా (Pan India) గుర్తింపు వచ్చి ఉండేదేమో అనే కామెంట్లు నెట్టింట వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్‌గా మారింది. ఎన్టీఆర్ ఇటీవల వార్ 2తో బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అరంగేట్రం చేశాడు. కానీ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తుండగా, ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.