ePaper
More
    HomeతెలంగాణKTR | మీ సీఎం ఏం చేస్తున్నారో తెలుసా? రాహుల్‌గాంధీని ప్ర‌శ్నించిన‌ కేటీఆర్‌

    KTR | మీ సీఎం ఏం చేస్తున్నారో తెలుసా? రాహుల్‌గాంధీని ప్ర‌శ్నించిన‌ కేటీఆర్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR | కాళేశ్వ‌రం అవినీతిపై ప్ర‌భుత్వం సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించడంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

    బీజేపీ సీబీఐని జేబు సంస్థ‌గా మార్చుకుని విప‌క్షాల‌పై దాడి చేయిస్తోంద‌ని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) అంటుంటే, అదే పార్టీకి చెందిన ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించార‌ని ఎద్దేవా చేశారు.

    రాహుల్‌గాంధీ, మీ సీఎం ఏం చేస్తున్నారో తెలుసా? అని ప్ర‌శ్నించారు. గ‌తంలో సీబీఐని ఉద్దేశించి రాహుల్‌ గాంధీ చేసిన ట్విట్‌ను సోమ‌వారం ఎక్స్‌లో తిరిగి పోస్టు చేసిన కేటీఆర్‌ (KTR).. మిస్టర్‌ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా అని పేర్కొన్నారు. ‘సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలు ఇప్పుడు  బీజేపీకి విపక్ష పార్టీలను నాశనం చేసే సెల్‌గా మారిపోయాయి. తద్వారా ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తున్నదంటూ రాహుల్‌ గతంలో వ్యాఖ్యానించారు.

    ఈ నేప‌థ్యంలోనే ఈ ట్వీట్‌ను తిరిగి పోస్టు చేసిన కేటీఆర్‌.. ‘కాళేశ్వరంను సీబీఐకి అప్పగించాలని తెలంగాణలో రాహుల్‌ గాంధీకి కరెన్సీ మేనేజర్ (సీఎం) నిర్ణయం తీసుకున్నారు. విపక్ష పార్టీలను నాశనం చేసే సెల్‌గా సీబీఐని గతంలో రాహుల్‌ గాంధీ అభివర్ణించారు. మిస్టర్‌ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. తమపై ఎన్ని కుట్రలు చేసినా.. రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. న్యాయయ వ్యవస్థ, ప్రజలపై తమకు నమ్మకం ఉంది. సత్యమేవ జయతే’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

    Latest articles

    Earthquake | అఫ్గానిస్తాన్​లో భూకంపం.. 800కు చేరిన మృతుల సంఖ్య

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Earthquake | అఫ్గానిస్తాన్(Afghanistan)​లో భారీ భూకంపంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో ఇప్పటి...

    Vice President Elections | అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా : ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Elections | రాజ్యాంగాన్ని రక్షించడం కోసమే తాను ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ...

    CPS | పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి

    అక్షరటుడే, కామారెడ్డి: CPS | సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టీఎన్జీవోస్...

    Nizamabad City | సీతారాంనగర్ కాలనీ సమస్యలను పరిష్కరించాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | సీతారాంనగర్ కాలనీలోని (Sitaramnagar Colony) సమస్యలు పరిష్కరించాలని కాలనీవాసులు కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డిని...

    More like this