అక్షరటుడే, వెబ్‌డెస్క్:PM Modi | ఏపీ రాజధాని అమరావతి(Amaravati) పునఃప్రారంభోత్సం కార్యక్రమం ఎంత అట్టహాసంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెలగపూడిలోని సచివాలయం వెనుక ఉన్న ప్రాంతంలో అమరావతి సభ ఘనంగా నిర్వహించారు. భారీ జనసందోహం మధ్య అమరావతి ప్రారంభోత్సవ సభ అట్టహాసంగా జరగగా, ఈ సభలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని పిలిచి సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చారు. పవన్ Pawan Kalyanతన ప్రసంగం పూర్తి చేసుకొని తన ప్లేస్‌లో కూర్చోబోతున్న సమయంలో పవన్‌ని పిలిచారు. మోదీ దగ్గరకి వెళ్లిన పవన్‌కి చాక్లెట్(Chocolate) ఇచ్చారు. దాంతో పక్కనే ఉన్న చంద్రబాబు తెగ నవ్వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
PM Modi | అదిరింది..
మొదటి నుండి పవన్ కళ్యాణ్‌పై మోదీ Narendra modi ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న విషయం తెలిసిందే. ఎంత మందిలో పవన్ ఉన్నా కూడా ప్రత్యేకంగా పిలిచి పలకరిస్తుంటారు. మోదీ, పవన్ సన్నివేశాలు ఎప్పుడు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక సభలో పవన్ కళ్యాణ్.. చంద్రబాబు(Chandrababu)ని హైలైట్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాళ్లు, రప్పల్లో మహానగరాన్ని చూసిన వ్యక్తి చంద్రబాబు అని పవన్ కళ్యాణ్ అన్నారు. సైబరాబాద్‌ను ఏ విధంగా అభివృద్ధి చేశారో.. అమరావతిని కూడా అపార అనుభవం, దక్షతతో అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతారని చెప్పుకొచ్చారు.. అమరావతి ఏపీకే కాదు భారత్‌కే తలమానికంగా అవుతుందన్నారు.
పహల్గామ్ ఉగ్రదాడితో Terrorist attack దేశంలో కీలక పరిస్థితులు ఉన్నప్పటికీ అమరావతి రైతులు(Amaravati Farmers) చేసిన త్యాగాలు మరిచిపోకూడదంటూ.. ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఇక్కడకు వచ్చినందుకు ప్రధాని మోదీ(Prime Minister Modi)కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు పవన్ కళ్యాణ్(Pavan Kalyan). కనదుర్గమ్మ ఆశీస్సులతో ప్రధాని మోదీకి బలాన్ని ఇవ్వాలని అందరం ప్రార్థిద్దామని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు.దివిసీమ తుపానులా వైసీపీ ప్రభుత్వం(YCP Government) అమరావతిని తుడిచేసిందన్న పవన్ కళ్యాణ్.. ధర్మయుద్ధంలో ఎట్టకేలకు అమరావతి రైతులే విజయం సాధించారని కొనియాడారు.
సభలో పవన్ కళ్యాణ్‌ని పిలిచి మోదీ ఇచ్చిన సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?#PawannKalyan #NarendraModi #ChandrababuNaidu pic.twitter.com/5Yrwtc6BTc
— Akshara Today (@aksharatoday) May 3, 2025