ePaper
More
    HomeజాతీయంVande Bharat Train | నాందేడ్ నుంచి ముంబైకి వందేభారత్.. ఎన్ని గంటల్లో వెళ్తారో తెలుసా..!

    Vande Bharat Train | నాందేడ్ నుంచి ముంబైకి వందేభారత్.. ఎన్ని గంటల్లో వెళ్తారో తెలుసా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vande Bharat Train | ప్రయాణికులకు రైల్వే శాఖ(Railway Department) గుడ్​న్యూస్​ చెప్పింది. ముంబై నుంచి జాల్నా మధ్య నడుస్తున్న వందే భారత్​ రైలును నాందేడ్​ వరకు పొడిగించింది.

    ఆధునిక హంగులతో వేగవంతమైన ప్రయాణం కోసం కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను (Vande Bharat Trains) ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు మార్గాల్లో వందే భారత్​ ట్రైన్లు నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కేంద్రం మరిన్ని వందే భారత్​ రైళ్లను ప్రవేశ పెట్టాలని చూస్తోంది. అలాగే ప్రస్తుతం నడుస్తున్న పలు రైళ్లను కూడా ఇతర స్టేషన్లకు పొడిగిస్తోంది. ఇందులో భాగంగా ముంబై(Mumbai)లోని ఛత్రపతి శివాజీ టర్మినల్​ నుంచి జాల్నా మధ్య నడుస్తున్న రైలును నాందేడ్(Nanded)​ వరకు పొడిగించింది.

    Vande Bharat Train | పది స్టేషన్లు.. 9:25 గంటల ప్రయాణం

    ప్రస్తుతం ఉన్న ఛత్రపతి శివాజీ మహరాజ్​ టర్మినల్ (Chhatrapati Shivaji Maharaj Terminal)​– జాల్నా వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ను ఛత్రపతి శివాజీ మహరాజ్​ టర్మినల్–హుజుర్​ సాహేబ్​ నాందేడ్​ వందే భారత్​ ఎక్స్​ప్రెస్​గా మార్చారు. గతంలో ఈ ట్రెయిన్​ ముంబై నుంచి జల్నాకు 6 గంటల 50 నిమిషాల్లో వెళ్లేది. ప్రస్తుతం ముంబై నుంచి నాందేడ్​కు 9 గంటల 25 నిమిషాల్లో చేరుకోనుంది. మధ్యలో దాదర్​, థానే, కల్యాణ్​, నాసిక్​ రోడ్డు, మన్మాడ్​, ఔరంగబాద్​, జల్నా, పర్బనీ స్టేషన్​లలో ఆగనుంది.

    నాందేడ్​ నుంచి ముంబై మార్గంలో నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో రైల్వేశాఖ వందే భారత్​ రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల నుంచి వీటికి ఆదరణ వస్తుండటంతో తాజాగా జాల్నా వరకు నడుస్తున్న వందే భారత్​ రైలును నాందేడ్ వరకు పొడిగించింది.

    Vande Bharat Train | నిజామాబాద్​ వరకు పొడిగిస్తే మేలు

    ఉమ్మడి నిజామాబాద్(Nizamabad), కరీంనగర్ (Karim Nagar)​ జిల్లాల నుంచి నిత్యం ముంb వందలాది మంది రాకపోలకు సాగిస్తారు. సికింద్రాబాద్​ నుంచి నాందేడ్​, ముంబై మధ్య నడిచే రైళ్లలో నిత్యం రద్దీ అధికంగా ఉంటుంది. కరీంనగర్​, నిజామాబాద్​ జిల్లాలకు చెందిన ఎంతో మంది గల్ఫ్​ దేశాలకు వలస వెళ్తారు. వీరు కూడా ముంబై మీదుగా రాకపోకలు సాగిస్తారు. అలాగే ముంబైలో ఎంతో మంది స్థిరపడ్డారు. ఈ క్రమంలో వందే భారత్​ రైలును నిజామాబాద్​ వరకు పొడిగిస్తే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది.

    ప్రస్తుతం ముంబైకి రైళ్లు అందుబాటులో ఉన్నా.. ప్రైవేట్​ బస్సుల్లో చాలా మంది వెళ్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ప్రైవేట్​ బస్సులు నిజామాబాద్​ నుంచి ముంబైకి రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో వందేభారత్​ను నిజామాబాద్​ వరకు పొడిగిస్తే ప్రయాణికులకు మేలు కలుగనుంది.

    More like this

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...