అక్షరటుడే, ఇందల్వాయి: Railway Gate | డిచ్పల్లి – ఘన్పూర్(Ghanpur) మధ్య రైల్వేగేట్‌ను మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ రైల్వేగేట్ 8వ తేదీ శనివారం రాత్రి పది గంటల నుంచి నుంచి 9వ తేదీ రాత్రి 11 గంటల వరకు రెండు రోజుల పాటు మూసి ఉంటుందని వివరించారు.
Railway Gate | ఎల్సీ గేట్ మరమ్మతుల నిమిత్తం..
ఈ మార్గంలో ఎల్సీ గేట్ (LC Gate) మరమ్మతుల నిమిత్తం గేట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా రైల్వేగేట్ వద్ద భద్రత ఏర్పాట్లు చూడాలని రైల్వే అధికారులు డిచ్పల్లి పోలీస్‌స్టేషన్‌కు (Dichpally Police Station) సమాచారం అందించారు.
