HomeసినిమాAishwarya Rai | కేవలం 4 సెకన్ల యాడ్‌తో రాత్రికి రాత్రే స్టార్ అయిన హీరోయిన్...

Aishwarya Rai | కేవలం 4 సెకన్ల యాడ్‌తో రాత్రికి రాత్రే స్టార్ అయిన హీరోయిన్ ఎవరో తెలుసా?

నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఐష్ జీవితాన్ని 4 సెక‌న్ల యాడ్ పూర్తిగా మార్చేసింది. ఆ ప్రకటన ప్రసారమైన వెంటనే దేశవ్యాప్తంగా సంచలనమైంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Aishwarya Rai | అందం, అభినయం, ఆకర్షణ.. ఈ మూడు గుణాలతో బాలీవుడ్‌ను కట్టిపడేసిన హీరోయిన్ ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) బచ్చన్. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఆమెకి స్టార్‌డమ్ కేవలం 4 సెకన్ల యాడ్‌తో వ‌చ్చింది.

నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఐశ్వర్య, అప్పట్లో పలు యాడ్‌లలో నటించింది. అయితే 1993లో వచ్చిన ఒక పెప్సీ యాడ్ (Pepsi Add) ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఆ యాడ్‌లో అమీర్ ఖాన్‌తో కలిసి కేవలం నాలుగు సెకన్ల పాటు మాత్రమే కనిపించిన ఐశ్వర్య రాయ్, తన లుక్‌, ఎక్స్ప్రెషన్స్‌తో దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది.ఇటీవల ప్రముఖ నిర్మాత ప్రహ్లాద్ కక్కర్ (Producer Prahlad Kakkar) ఒక ఇంటర్వ్యూలో ఆ సంఘటనను గుర్తుచేసుకున్నారు.

Aishwarya Rai | ఏదో మాయ‌..

ప్రహ్లాద్ కక్కర్ మాట్లాడుతూ.. ఐశ్వర్య రాయ్ ఆ యాడ్‌లో కేవలం 4 సెకన్లు మాత్రమే కనిపించింది. కానీ ఆ ప్రకటన ప్రసారమైన వెంటనే దేశవ్యాప్తంగా స్పందన వచ్చింది. ఆ యాడ్ విడుదలైన 24 గంటల్లో నాకు 5 వేలకుపైగా కాల్స్ వచ్చాయి. ఆమె అందం చూసి ప్రజలు మంత్ర ముగ్ధులయ్యారు,” అని తెలిపారు. అలానే ఆడిషన్ సమయంలో ఐశ్వర్య కళ్లలోకి చూసినప్పుడు, ఆమె కళ్ల రంగు మారుతూ కనిపించిందని చెప్పుకొచ్చారు. ఆమె కళ్లలో కొన్నిసార్లు బూడిద రంగు, కొన్నిసార్లు ఆకుపచ్చ, మరికొన్నిసార్లు నీలం రంగు కనిపించేది. అది ఒక మాయలాగా అనిపించింది అని ప్రహ్లాద్ కక్కర్ గుర్తుచేసుకున్నారు.

ఆ యాడ్ వచ్చిన తరువాత ఐశ్వర్య రాయ్ పేరు ఒక్కసారిగా మీడియా, ఫ్యాషన్ ఇండస్ట్రీల్లో మారుమోగిపోయింది. మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకునే ముందు నుంచే ఆమె పేరు ప్రతి ఇంట్లో వినిపించేది. తరువాత, 1994లో ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుని బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ప్రస్తుతం కూడా ఆమె చేసిన ఆ తొలి యాడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఐశ్వ‌ర్య‌రాయ్ ఒక్క బాలీవుడ్‌కి మాత్ర‌మే ప‌రిమితం కాలేదు. త‌మిళం, తెలుగు భాష‌ల‌లో కూడా వైవిధ్య‌మైన సినిమాలు చేసిన ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది.

Must Read
Related News