అక్షరటుడే, వెబ్‌డెస్క్:Akhil-Zainab Marraige | అక్కినేని అఖిల్- జైనబ్ రవ్జీ(Zainab Rawji)ల వివాహం శుక్రవారం తెల్లవారుజామున అట్టహాసంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కొందరు ప్రముఖుల మధ్య ఈ జంట ఒక్కటయ్యారు.
ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలని అక్కినేని కుటుంబ సభ్యులు ఇంకా బయటపెట్టలేదు. వివాహ రిసెప్షన్ జూన్ 8న జరగనున్నట్టు తెలుస్తుంది. అయితే అఖిల్‌ని Akhil వివాహమాడిన తర్వాత జైనబ్ బ్యాగ్రౌండ్ ఏంటి? జైనబ్ ఎవరు? అని తెలుసుకోడానికి నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో అనేక ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. జైనబ్ రావ్డ్జీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో పేరుగాంచిన పారిశ్రామికవేత్త జుల్ఫీ రావ్డ్జీ(Zulfi Rawji) కుమార్తె అని తెలుస్తోంది.
Akhil-Zainab Marraige | బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
జైనబ్ సోదరుడు జైన్ రావ్డ్జీ ZR రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. జైనబ్ ఒక టాలెంటెడ్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ (Social media influencer) కూడా. ఇండియాలోనే కాదు దుబాయ్, లండన్‌లోనూ ఆర్టిస్ట్‌గా రాణించింది ఈ అమ్మడు. హైదరాబాద్‌లో జరిగిన రిఫ్లెక్షన్స్ తో సహా అనేక ఎగ్జిబిషన్స్ లో ఆమె అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ ను ప్రదర్శించారట.!
ప్రస్తుతం ముంబైలో నివాసం ఉన్నప్పటికీ, జైనబ్ Zainab పుట్టి పెరిగింది హైదరాబాద్(Hyderabad city) సిటీలోనే అని తెలుస్తోంది. అఖిల్ కన్నా జైనబ్ తొమ్మిదేళ్లు పెద్దదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అక్కినేని అఖిల్, జైనాబ్‌ల మధ్య వయస్సు తేడా 9 సంవత్సరాలు. అఖిల్ వయస్సు ప్రస్తుతం 30 సంవత్సరాలు కాగా , జైనాబ్ వయస్సు 39. ఇప్పుడు వారి వయస్సు విషయంలో జోరుగా చర్చ నడుస్తుంది. అఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) పోస్ట్‌లో కామెంట్ సెక్షన్‌ను డిసేబుల్ చేయడం ద్వారా ఈ చర్చ మరింత ఎక్కువైంది.
జుల్ఫీ రావ్‌డ్జీ, అక్కినేని నాగార్జున Nagarjuna మధ్య ఎన్నో ఏళ్లుగా మంచి స్నేహబంధం ఉందట. అఖిల్ హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్న సమయంలో జైనబ్ తో పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారిందని టాక్. గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ.. ఇరు కుటుంబాలు అంగీకారంతో తాజాగా ఒక్కటయ్యారు. కొద్దిమంది సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో గతేడాది అఖిల్ – జైనబ్ నిశ్చితార్థం జరిగింది. ఇండియా వైడ్‌గా వ్యాపార రంగంలో రవ్‌డ్జీ ఫ్యామిలీ బాగా సెటిల్ అయ్యారని తెలుస్తోంది. అయితే వీరి ఆస్తుల చిట్టా ఇంకా బయటకు తెలియనప్పటికీ.. కొన్ని వేల కోట్లల్లోనే ప్రాపర్టీస్ ఉంటాయని సమాచారం.