Homeలైఫ్​స్టైల్​Green Tea | ఉదయం ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగుతారా.. దాని ప్రభావం ఏమిటో...

Green Tea | ఉదయం ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగుతారా.. దాని ప్రభావం ఏమిటో తెలుసా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Green Tea : ఇటీవలి కాలంలో ఆరోగ్య ఉండడానికి, స్లిమ్​గా తయారు కావడానికి గ్రీన్ టీని (Green Tea) తెగ తాగేస్తున్నారు. ఇది ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. యాంటీఆక్సిడెంట్లు (antioxidants) అధికంగా ఉండే ఈ గ్రీన్​ టీ బరువు తగ్గడంలో కీలక ప్రభావకారిగా ఉంటుందంటున్నారు. అందుకే కొందరు తమ ఉదయాన్ని గ్రీన్ టీతో ప్రారంభిస్తుంటారు. దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు. అయితే చాలా మంది నిపుణులు మాత్రం ఉదయం ఖాళీ కడుపుతో గ్రీన్​ టీ తాగొద్దని సెలవిస్తున్నారు.

Green Tea | ఎందుకు తాగొద్దంటే..

ఆరోగ్య ఔషధనిగా భావించే గ్రీన్ టీలో టానిన్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. అయితే ఖాళీ కడుపుతో గ్రీన్​ టీ తాగినప్పుడు ఇవి ఆమ్ల ఉత్పత్తిని పెంచుతాయి. ఫలితంగా ఆమ్లత్వం పెరిగి.. గుండెల్లో మంట (heartburn), అజీర్ణం (indigestion), వికారం (nausea arise) వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు సహజ జీర్ణక్రియను సైతం ప్రభావితం చేస్తుందట. మరో విషయం ఏమిటంటే.. గ్రీన్ టీలోని కాటెచిన్లు ఆహారం నుంచి ఇనుము శోషించే గుణాన్ని తగ్గిస్తాయట.

Green Tea | సరైన సమయం తెలుసుకోండి..

గ్రీన్ టీ తాగడానికి ఉత్తమ సమయాన్ని నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటంటే.. భోజనం తర్వాత, తేలికపాటి అల్పాహారం తర్వాత తీసుకోవచ్చని చెబుతున్నారు. ఉదయం తేలికపాటి అల్పాహారం తీసుకున్నాకే.. గ్రీన్ టీ తాగడం ఉత్తమమని అంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లు అంది, శక్తి స్థాయిలను పెంచుతుందని పేర్కొంటున్నారు. భోజనం తర్వాత గ్రీన్ టీ తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగవుతుదంట.

కడుపులోకి ఏదైనా ఆహారంగా తీసుకున్న తర్వాతే గ్రీన్​ టీ (Green Tea) తాగడం వల్ల.. జీర్ణక్రియ వేగవంతం అవుతుంది, కడుపు సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు, సాయంత్రం వేళల్లో శరీర శక్తి తక్కువగా ఉన్నట్లు అనిపించినప్పుడు గ్రీన్ టీ సహజ శక్తిని ఇస్తుందని చెబుతున్నారు. అందుకే కొందరు వ్యాయామం చేయడానికి ముందు, తర్వాత గ్రీన్ టీ తాగడానికి ఇష్టపడతారట.

Green Tea : ఎంత తాగాలంటే..

సాధారణంగా, రోజుకు 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీకి మించి తాగొద్దట. దీనిని ఎక్కువగా తాగడం వల్ల కడుపు నొప్పి (stomach pain), నిద్రలేమి (insomnia), కాలేయం (liver)పై ఒత్తిడి (stress) వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయట. సో, టేక్​ కేర్​ మరి.