అక్షరటుడే, వెబ్‌డెస్క్: do-or-die match | ఆసియా కప్ 2025లో Asia Cup 2025 మంగళవారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచి ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
మరోవైపు ఈ పరాజయంతో శ్రీలంక Sri lanka సెమీస్ రేసులో వెనుకబడి, అద్భుతం జరగకపోతే టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులకే పరిమితమైంది.
కామిందు మెండిస్ (44 బంతుల్లో 50; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో పోరాడగా, మిగతా బ్యాటర్లు తీవ్రంగా విఫలమయ్యారు. కుశాల్ మెండిస్ (0), డసున్ షనక (0), పాతుమ్ నిస్సంక (8) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు.
do-or-die match | శ్రీలంక పరిస్థితి ఏంటి?
ఇక కెప్టెన్ చరిత్ అసలంక (20) కొంత సహకరించిన కూడా భారీ పరుగులు చేయలేకపోయాడు. పాక్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది (3/28), హరీస్ రౌఫ్ (2/37), హుస్సేన్ తలత్(2/18), అబ్రర్ అహ్మద్ (1/26) కలిసి శ్రీలంక బ్యాటింగ్‌ను కట్టడి చేశారు.
దాంతో శ్రీలంక జట్టు తక్కువ స్కోరుకే పరిమితం అయింది. ఇక 134 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్ 18 ఓవర్లలోనే విజయం సాధించింది.
చివర్లో హుస్సేన్ తలత్ (32 నాటౌట్, 30 బంతులు, 4 ఫోర్లు), మహ్మద్ నవాజ్ (38 నాటౌట్, 24 బంతులు, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి పాక్ Pakistan విజయాన్ని ఖాయం చేశారు.
అంతకుముందు టాప్ ఆర్డర్‌లో ఫర్హాన్ (24), ఫఖర్ జమాన్ (17) విలువైన పరుగులు చేశారు. ఇక శ్రీలంక బౌలర్లలో మహీష్ తీక్షణ (2/24), వానిందు హసరంగా (2/27), దుష్మంత్ చమీరా (1/31) పాక్‌ని కట్టడి చేసే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది.
మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ మాట్లాడుతూ, “పిచ్ పరిస్థితులు, వాతావరణం దృష్ట్యా బౌలింగ్ ఎంచుకోవడమే సరైన నిర్ణయం. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.
ఆ తర్వాత తలత్, నవాజ్ జంట మాకు గెలుపు అందించారు అని అన్నారు. మొత్తానికి ఈ విజయంతో పాకిస్థాన్ ఫైనల్ రేసులో దూసుకెళ్లగా, శ్రీలంక Srilanka అవకాశాలు దాదాపు ముగిసినట్టే కనిపిస్తున్నాయి.
ఇక ఈ రోజు భారత్- బంగ్లాదేశ్ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో మనోళ్లు గెలిచి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవాలని భావిస్తున్నారు.