ePaper
More
    HomeFeaturesOnline Searching | డిజిట‌ల్ యుగంలో జ‌ర‌ జాగ్ర‌త్త‌.. మీరు ఆ ప‌దాలు గూగుల్‌లో వెతికారో...

    Online Searching | డిజిట‌ల్ యుగంలో జ‌ర‌ జాగ్ర‌త్త‌.. మీరు ఆ ప‌దాలు గూగుల్‌లో వెతికారో జైలుకే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Online Searching | ఈ డిజిటల్ యుగంలో ఏదైనా విషయం మన మనసులోకి వచ్చిన వెంటనే, చేతిలో ఉన్న మొబైల్‌ ఫోన్‌ (Mobile Phone) తీసుకుని గూగుల్​ను అడగడం చాలా సాధారణమైంది. మిలియన్ల డేటా ఆధారంగా, గూగుల్ కొన్ని సెకన్లలోనే ప్రశ్నలకు సమాధానాలను అందిస్తుంది.

    వాస్తవానికి ఇది ఒక అద్భుతమైన సౌకర్యమే. అయితే ఈ సౌకర్యం ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉంది. మీరు గూగుల్‌లో (Google) ఏం వెతుకుతున్నారు అనే దానిపైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇటీవ‌ల కొంతమంది ఉత్సాహంతో, లేదా అజ్ఞానంతో చాలా క్యూరియాసిటితో కొన్ని సంక్షిప్త, ప్రమాదకరమైన పదాలను గూగుల్‌లో వెతుకుతున్నారు.

    పదాలు వెతికేముందు జాగ్రత్త

    మన సెర్చింగ్​పై సైబర్ అధికారులు (Cyber Officers) క‌న్నేసి ఉంచుతున్నారు. ఉదాహరణకు, మీరు ఈ కింది పదాలను గూగుల్‌లో శోధిస్తే అది నేరంగా పరిగణించబడే అవకాశముంది.

    • మందుగుండు సామగ్రి (Explosives) ఎలా తయారు చేయాలి?
    • నకిలీ మందులు తయారీ పద్ధతులు
    • ఏటీఎం హ్యాకింగ్ ట్రిక్స్
    • మొబైల్ లేదా సోషల్ మీడియా హ్యాకింగ్
    • నకిలీ కరెన్సీ ముద్రణ పద్ధతులు
    • ఆయుధాలు ఎక్కడ దొరుకుతాయి?

    ఈ తరహా శోధనలు మీపై నేరచర్యలకు దారితీయవచ్చు. సైబర్ క్రైమ్ విభాగం (Cyber ​​Crime Department) ఈ క్వైరీస్‌ను ట్రాక్ చేయగలదు. మీరు ఏదైనా డివైస్ నుంచి ఇటువంటి పదాలను శోధిస్తే, ఐపీ అడ్రస్ ఆధారంగా గుర్తించి కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఇకపోతే, అశ్లీలత, పిల్లల అశ్లీలత, అసభ్యమైన చిత్రాలు, వీడియోలు వంటి పదాలను గూగుల్‌లో తరచూ వెతికే వారిపై కూడా నిఘా పెరుగుతోంది. పిల్లల అశ్లీలతను కలిగించే కంటెంట్ పట్ల ప్రభుత్వాలు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇది తీవ్ర నేరంగా పరిగణించబడుతుంది. ఇలాంటి కంటెంట్‌ను చూసినట్టు ఆధారాలు లభిస్తే, జీవితాంతం జైలుశిక్ష కూడా తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    కాగా.. ప్రపంచంలో ఏం జ‌రిగినా అది మ‌న అర చేతిలో చూస్తాం. అదే సమయంలో టెక్నాల‌జీని అజ్ఞానంతో వాడితే వారిని నేరస్థుడిని కూడా చేస్తుంది. కాబట్టి, గూగుల్ వంటి శోధన యంత్రాలను ఉపయోగించేప్పుడు, మీరు ఏం టైప్ చేస్తున్నారో ఒక‌సారి ఆలోచించండి. నిబంధనలకు వ్యతిరేకంగా సెర్చ్ చేయ‌డం ద్వారా మీ వ్యక్తిగత గోప్యత, భవిష్యత్తు రెండూ ప్రమాదంలో పడతాయి.

    Latest articles

    Tea-snacks | టీ తో కలిపి ఈ స్నాక్స్ తింటే, అంతే సంగతులు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tea-snacks | టీ మన జీవితంలో ఒక భాగమైపోయింది. చాలామంది ఉదయం, సాయంత్రం టీ తాగే...

    August 31 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం భక్తి

    August 31 Panchangam : తేదీ (DATE) – 31 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Kamareddy Flood troubles | నాలాల ఆక్రమణలతోనే వరద కష్టాలు.. మీడియాతో కామారెడ్డి వాసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Flood troubles | కుండపోత వర్షం కామారెడ్డి ప్రజలకు (Kamareddy People) కన్నీళ్లు మిగిల్చింది....

    Lunar eclipse | చంద్ర గ్రహణం.. శ్రీవారి ఆలయం మూసివేత.. ఎప్పుడంటే..

    అక్షరటుడే, తిరుమల: Lunar eclipse : చంద్ర గ్రహణం రాబోతోంది. సెప్టెంబరు 7న చంద్ర గ్రహణం ఏర్పడబోతోంది. ఈ...

    More like this

    Tea-snacks | టీ తో కలిపి ఈ స్నాక్స్ తింటే, అంతే సంగతులు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tea-snacks | టీ మన జీవితంలో ఒక భాగమైపోయింది. చాలామంది ఉదయం, సాయంత్రం టీ తాగే...

    August 31 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం భక్తి

    August 31 Panchangam : తేదీ (DATE) – 31 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Kamareddy Flood troubles | నాలాల ఆక్రమణలతోనే వరద కష్టాలు.. మీడియాతో కామారెడ్డి వాసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Flood troubles | కుండపోత వర్షం కామారెడ్డి ప్రజలకు (Kamareddy People) కన్నీళ్లు మిగిల్చింది....