అక్షరటుడే, ఇందల్వాయి: Mla Bhupathi Reddy | ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఓన్నాజీపేట శివారులోని ముత్యాల చెరువు(రిజర్వాయర్) (Mutyala Cheruvu) తెగిపోయింది. అయితే, చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టవద్దని చెరువు ఆయకట్టు గ్రామాల రైతులు కోరారు.
ఈ మేరకు సోమవారం రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసి విన్నవించారు. చెరువు తెగి బీరప్ప తండా(Bheerappa Cheruvu), మద్దుల తండా, వాడి, సీతాయిపేట్ తండా, సీతాయిపేట్, కొండూరు, వాల్గొట్, భీమ్‌గల్ గ్రామాల్లో భారీగా ఆస్తి, పంట నష్టంతోపాటు పశువులు నష్టపోయామన్నారు. చెరువు పునరుద్ధరణ చేపడితే ఆయా గ్రామాలకు హాని ఉంటుందని, పునర్నిర్మాణం చేయవద్దని కోరారు.
దీంతో స్పందించిన ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులతో(Irrigation officials) మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. ముత్యాల చెరువుకు మత్తడి నిర్మించి హాన్నాజీ పేట్ చెరువు నిండేలా ముత్యాల చెరువు కింద చెక్‌డ్యాంలు కట్టి, వరద తాకిడి తగ్గేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. తద్వారా భూగర్భజలాలు పెరుగుతాయన్నారు.