అక్షరటుడే, ఇందూరు: CP Sai Chaitanya | స్థానిక సంస్థల ఎన్నికల (local body elections) నేపథ్యంలో సరైన ఆధారాల్లేకుండా రూ. 50వేల కంటే ఎక్కువ డబ్బును తరలించవద్దని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సూచించారు.
జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ హాల్లో (Command Control Hall) బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పకుండా పాటించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ మొత్తంలో నగదు తరలిస్తే సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
CP Sai Chaitanya | త్వరలోనే చెక్‌పోస్టులు ఏర్పాటు..
ఎన్నికల షెడ్యూల్ (election schedule) విడుదలైన నేపథ్యంలో తక్షణం కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని, నవంబర్ 11న ప్రక్రియ పూర్తికానుందన్నారు. కమిషనరేట్ కేంద్రంలో ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే అంతర్ జిల్లా, అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు కేంద్రాలను (check post centers) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందుకే చెక్‌పోస్టుల వద్ద ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గత ఎన్నికల్లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని నేరస్తులను, రౌడీషీటర్లను ఆయా రెవెన్యూ అధికారుల ముందు బైండోవర్ చేయాలని సూచించారు.
CP Sai Chaitanya | నామినేషన్ల స్వీకరణ నుంచి..
నామినేషన్ల స్వీకరణ నుంచి ఎన్నికల నిర్వహణ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉంటూ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని సీపీ సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలని, అనుమానాలు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి (Additional DCP Baswareddy), ఏసీపీలు వెంకటేశ్వర్లు, రాజా వెంకటరెడ్డి, శ్రీనివాస్, సీసీఆర్బీ సీఐ సతీష్, ఎలక్షన్ సెల్ సీఐ వీరయ్య, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
3 comments
[…] కృషి చేస్తానని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈమేరకు ఆయన బుధవారం ఒక […]
[…] కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) మాట్లాడుతూ దేశవ్యాప్త కార్యక్రమంలో […]
[…] అని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో […]
Comments are closed.