అక్షరటుడే,బోధన్: Bhubarathi | భూభారతి దరఖాస్తులను ఎట్టిపరిస్థితుల్లో పెండింగ్లో ఉంచవద్దని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Sub-Collector Vikas Mahato) అధికారులను ఆదేశించారు. సోమవారం సాలూర తహశీల్దార్ కార్యాలయాన్ని(Salura) ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వివరాలను ఆన్లైన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు.
