అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | వచ్చే మూడు నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు చెరువులు, కుంటల వద్దకు వెళ్లవద్దని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) ప్రజలకు సూచించారు.
కామారెడ్డి (Kamareddy), అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులను బుధవారం ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భారీ వర్షాల (Heavy Rains) నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దన్నారు. సరదాగా గడిపేందుకు నిండుగా ఉన్న చెరువులు, కుంటల వద్దకు వెళ్లడం మానుకోవాలని సూచించారు.
ఇంటికి వెళ్లే తొందరలో వరద ప్రవాహాలను దాటే ప్రయత్నం చేసి విలువైన ప్రాణాలు కోల్పోవద్దని హెచ్చరించారు. పాడుబడ్డ, కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లలో ఉండేవాళ్లు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్లు (transformers), విద్యుత్ తీగలకు (electric wires) దూరంగా ఉండాలని, తడి చేతులతో విద్యుత్ సరఫరా అయ్యే వస్తువులను తాక వద్దన్నారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా ఉంటే వెంటనే అధికారులకు తెలిజేయలన్నారు. ఎస్పీ వెంట కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, కామారెడ్డి రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్సై రంజిత్ ఉన్నారు.