112
అక్షరటుడే, ఆర్మూర్: Armoor Police | మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ (Armoor SHO Satyanarayana Goud) సూచించారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆదివారం ఆర్మూర్ పట్టణంలో (Armoor town) ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులకు డ్రంకన్ డ్రైవ్‌పై అవగాహన కల్పించారు.
Armoor Police | పరిమితికి మించి ఆటోల్లో ఎక్కించవద్దు..
అదేవిధంగా ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్యాసింజర్లను ఎక్కించుకోకూడదని ఎస్‌హెచ్‌వో సూచించారు. యూనిఫామ్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని వివరించారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసి జరిమానాతో పాటు కఠినచర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై రఘుపతి, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.