- Advertisement -
HomeతెలంగాణCBSE Schools | అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించవద్దు

CBSE Schools | అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించవద్దు

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: CBSE Schools | సీబీఎస్ఈ అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించవద్దని అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్ కుమార్ కోరారు. శుక్రవారం మాధవ నగర్​లోని (Madhava Nagar) ఎస్ఎస్ఆర్ డిస్కవరీ (SSR Discovery) పాఠశాలలో సీబీఎస్సీ స్కూల్ అసోసియేషన్ (CBSC School Association) ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఏడు పాఠశాలలకు మాత్రమే సీబీఎస్సీ అనుమతి ఉందన్నారు. మాధవ్ నగర్, జన్నపల్లిలోని ఎస్ఎస్ఆర్ డిస్కవరీ, దాస్ నగర్​లో నవ్య భారతి గ్లోబల్ స్కూల్(Navya Bharati Global School), ఆర్మూర్​లోని క్షత్రియ (Kshatriya), సెయింట్ ఆన్స్(Saint Ann’s), జిల్లా కేంద్రంలోని ప్రెసిడెన్సీ (Presidency), నాలెడ్జ్ పార్క్ (Knowledge Park) పాఠశాలలకు మాత్రమే అనుమతి ఉందన్నారు.

- Advertisement -

ఎలాంటి అనుమతి లేకుండా ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖ, సీబీఎస్ఈ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే మరికొన్ని పాఠశాలలు సీబీఎస్సీ సిలబస్ పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని చెప్పారు. కావున తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షుడు మారయ్య గౌడ్, అసోసియేషన్ కన్వీనర్ ముజీబుద్దీన్, సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News