అక్షరటుడే, లింగంపేట: Lingampet | మండల కేంద్రంలోని పీహెచ్సీని డీఎంహెచ్వో చంద్రశేఖర్ (DMHO Chandrashekhar) శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీ (PHC) ఆవరణలో పిచ్చిమొక్కలు పెరగడంతో సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో పీహెచ్సీలోనే అపరిశుభ్రత ఉంటే ఎలా అని సిబ్బందిని ప్రశ్నించారు. సీజనల్ వ్యాధులపై (Seasonal diseases) ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు రాంబాయి, సీహెచ్వో ఠాగూర్, గోవిందరెడ్డి, ఫరీదా, యాదగిరి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
