ePaper
More
    HomeజాతీయంKarnataka Deputy CM | కోహ్లీకి ఘ‌న స్వాగ‌తం ప‌లికిన డిప్యూటీ సీఎం.. యువకులు అద్భుతంగా...

    Karnataka Deputy CM | కోహ్లీకి ఘ‌న స్వాగ‌తం ప‌లికిన డిప్యూటీ సీఎం.. యువకులు అద్భుతంగా ఆడారంటూ కామెంట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Karnataka Deputy CM | ఈ సాల కప్ నమదే (ఈ ఏడాది కప్ మనదే) అంటూ.. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్టు గత రాత్రి పంజాబ్‌పై ఘ‌న విజ‌యం సాధించి ట్రోఫీని కైవ‌సం చేసుకుంది. అహ్మదాబాద్‌లో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ కింగ్స్‌పై (Punjab Super Kings) అద్భుత విజయం సాధించి, అభిమానుల ఆనందం రెట్టింపు అయ్యేలా చేసింది. మ్యాచ్ ముగిసిన వెంటనే బెంగళూరు (Bangalore) వీధులు జనసంద్రంగా మారాయి. అభిమానులు జెండాలు ఊపుతూ, బాణాసంచా కాలుస్తూ, నినాదాలతో హోరెత్తించారు.

    Karnataka Deputy CM | డిప్యూటీ సీఎం స్వాగ‌తం..

    అభిమానుల పాటలు, నృత్యాలు, కేరింతలతో రాత్రంతా సందడి వాతావరణం నెలకొంది. చర్చ్ స్ట్రీట్‌లోని పబ్‌లు, కేఫ్‌ల (pubs and cafes) వద్ద వందలాది మంది అభిమానులు గుమిగూడి మ్యాచ్ చివరి క్షణాలను వీక్షించారు. ఆర్సీబీ గెలుపు ఖరారైన వెంటనే, అపరిచితులు సైతం ఆనందంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. యువకులు బాణాసంచా కాల్చగా, “ఈ సాలా కప్ నమదే!” నినాదాలు మిన్నంటాయి. ముఖ్యంగా కోరమంగళ, ఇందిరానగర్ ప్రాంతాల్లో బైక్‌లు, కార్లపై ఆర్సీబీ జెండాలతో (RCB flags) అభిమానులు ప్రదర్శనలు నిర్వహించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా జట్టుకు అండగా నిలిచిన విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరుతో నినాదాలు చేశారు.

    బుధవారం బెంగళూరుకు (Bengaluru) చేరుకున్న విజేత జట్టుకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. విమానాశ్రయం వెలుపల వేలాదిగా తరలివచ్చిన క్రికెట్ ప్రేమికులు “ఆర్సీబీ! ఆర్సీబీ!” అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ సందర్భంగా జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) విమానాశ్రయంలో స్వయంగా కలిసి అభినందనలు తెలిపారు. విక్టరీ పరేడ్​లో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం ఆర్సీబీ జెండా చేతపట్టుకుని తన వాహనంలో ప్రయాణించడం విశేషం. తాను మ్యాచ్‌ పూర్తిగా చూశానని, ఆర్సీబీ యువకులు అద్భుతంగా ఆడారని అన్నారు. కర్ణాటక ప్రజల తరఫున వారికి తాను అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.

    Latest articles

    Manda Krishna Madiga | మందకృష్ణను కలిసిన ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు

    అక్షరటుడే, బోధన్ : Manda Krishna Madiga | ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్...

    Jenda Balaji Festival | నేత్ర పర్వం.. జెండా బాలాజీ ఉత్సవం..

    అక్షరటుడే ఆర్మూర్ : Jenda Balaji Festival | తిరుమల వెళ్లలేని భక్తులకు తమ మొక్కలను.. కానుకలను.. ముడుపులను...

    Cloud Burst | ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌.. కొట్టుకుపోయిన గ్రామం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cloud Burst | ఉత్తరాఖండ్(Uttarakhand)​లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. క్లౌడ్​ బరస్ట్(Cloud Burst)​...

    Gautam Gambhir | తొలిసారి గంభీర్ కంట క‌న్నీరు.. మ్యాచ్ అయ్యాక ఎందుకంత ఎమోష‌న‌ల్ అయ్యాడు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gautam Gambhir | టీ-20 వరల్డ్‌కప్ గెలుచుకున్న త‌ర్వాత ఉన్నత స్థాయిలో ప్రయాణం ప్రారంభించిన...

    More like this