అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Karnataka Deputy CM | గత కొద్ది రోజులుగా ఆర్సీబీ (RCB) పేరు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఐపీఎల్-2025 ట్రోఫీని గెలుచుకోవడంతో ఆర్సీబీ జట్టు (RCB Team) సంబురాల్లో మునిగిపోయింది. తొలి కప్పు కల నెరవేరడంతో అభిమానులు కూడా ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే టైటిల్ నెగ్గినప్పటి నుంచి ఆ టీమ్‌కు ఏదీ కలసిరావడం లేదు. విక్టరీ పరేడ్‌లో (Victory Parade) తొక్కిసలాట జరగడం, 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విమర్శల పాలైంది ఆర్సీబీ యాజమాన్యం. ఇక ఇదిలా ఉంటే ఈ పాపులర్ ఫ్రాంచైజీని అమ్మేస్తున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. ఆర్సీబీ యజమాని సంస్థ డియాజియో (Diageo) తమ వాటా మొత్తాన్ని లేదా కొంత భాగాన్ని విక్రయించేందుకు ఉత్సాహంగా ఉందని, ఇప్పటికే పలువురు పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోందన్న కథనాలు వచ్చాయి
Karnataka Deputy CM | అదీ సంగతి..
ఈ వార్తలను డియాజియో ఖండించింది. అలాంటి ఉద్దేశం తమకు లేదని, ఊహాగానాలపై ఆధారపడినవే అవి అని కంపెనీ బీఎస్‌ఈకి స్పష్టం చేసింది. ఫ్రాంచైజీ అమ్మకంపై (franchise sale) వార్తలు వెలువడిన వేళ, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) ఆర్సీబీలో వాటా కొనుగోలు చేయబోతున్నారనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. తాజాగా దీనిపై స్పందించిన ఆయన, “అవి అంతా తప్పుడు వార్తలు. నేనేమీ పిచ్చోడిని కాను. చిన్ననాటి నుంచే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సభ్యుడిని. ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌లో చేరాలని ఆఫర్లు వచ్చినా, నాకు సమయం లేదు. నేను రాయల్ ఛాలెంజరే (Royal Challengers) తాగను. అటువంటి బ్రాండ్ అవసరం నాకు ఎందుకు?” అని (Dk Shiva kumar) క్లారిటీ ఇచ్చారు.
2008లో ఐపీఎల్ IPL ప్రారంభమైనప్పుడు బెంగళూరు ఫ్రాంచైజీని (Bangalore franchise) యునైటెడ్ బ్రెవరీస్ అధినేత విజయ్ మాల్యా సొంతం చేసుకున్నారు. తర్వాత ఆయన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో, భారత్‌లోని యునైటెడ్ స్పిరిట్స్ ద్వారా బ్రిటన్‌కు చెందిన డియాజియో కంపెనీ ఆ ఫ్రాంచైజీని స్వాధీనం చేసుకుంది.ఐపీఎల్‌లో పాపులర్ ఫ్రాంచైజీల్లో ఆర్సీబీ ఒకటి. ఒక్క టైటిల్ నెగ్గకపోయినా 18 ఏళ్ల పాటు తన బ్రాండ్ ఇమేజ్‌ను చెక్కుచెదరకుండా చూసుకుంది బెంగళూరు (Bangalore). ఏటికేడు అభిమాన గణాన్ని పెంచుకుంటూ పోయింది. ఈసారి కప్పు నెగ్గడంతో ఆర్సీబీ బ్రాండ్ (RCB Brand) విలువ మరింతగా పెరిగింది.