అక్షరటుడే, వెబ్‌డెస్క్: stock market | రిలయన్స్‌తోపాటు బ్యాంకింగ్ స్టాక్స్ (Banking stocks) రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ 52 వారాల గరిష్ట స్థాయిలను తాకాయి. అయితే గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో సూచీలు ప్రారంభ లాభాలను తగ్గించుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు (Domestic stock markets) నూతన వారాన్ని ఆశాజనకంగా ప్రారంభించాయి. భారీ లాభాల దిశగా సాగాయి. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ 52 వారాల గరిష్ట స్థాయిలను తాకాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్ 317 పాయింట్లు, నిఫ్టీ (Nifty) 115 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 84,196 నుంచి 84,656 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,788 నుంచి 25,926 పాయింట్ల మధ్యలో కదలాడాయి. చివరికి సెన్సెక్స్ (Sensex) 411 పాయింట్ల లాభంతో 84,363 వద్ద, నిఫ్టీ 133 పాయింట్ల లాభంతో 25,843 వద్ద స్థిరపడ్డాయి. హెవీ వెయిట్ స్టాక్స్ అయిన రిలయన్స్ (Reliance), బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐతోపాటు పలు ప్రైవేట్ బ్యాంకులు రాణించాయి.
stock market | పీఎస్‌యూ బ్యాంక్స్‌లో దూకుడు..
పీఎస్‌యూ బ్యాంక్స్ స్టాక్స్ గణనీయంగా పెరిగాయి. ఐటీ (IT), ఎనర్జీ, పీఎస్‌యూ రంగాలూ రాణించాయి. బీఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్ (PSU bank) ఇండెక్స్ 2.93 శాతం పెరగ్గా.. ఎనర్జీ 1.48 శాతం, టెలికాం 1.22 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.10 శాతం, ఐటీ 1.05 శాతం, పీఎస్‌యూ 0.95 శాతం, హెల్త్‌కేర్ 0.81 శాతం పెరిగాయి. మెటల్, ఎఫ్‌ఎంసీజీ, పవర్, ఆటో, కమోడిటీ ఇండెక్స్‌లు స్వల్పంగా నష్టపోయాయి. స్మాల్ క్యాప్ (Small cap) ఇండెక్స్ 0.69 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.59 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.47 శాతం లాభంతో ముగిశాయి.
stock market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈలో (BSE) నమోదైన కంపెనీలలో 2,530 కంపెనీలు లాభపడగా 1,740 స్టాక్స్ నష్టపోయాయి. 194 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 201 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 120 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 14 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 7 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 2.12 లక్షల కోట్ల మేర పెరిగింది.
Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 19 కంపెనీలు లాభాలతో ఉండగా.. 11 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. రిలయన్స్ 3.04 శాతం, రిలయన్స్ 3.52 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.65 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.17 శాతం, ఎస్‌బీఐ 1.97 శాతం, ఎయిర్‌టెల్ 1.95 శాతం పెరిగాయి.
Top losers..
ఐసీఐసీఐ బ్యాంక్ 3.19 శాతం, ఎంఅండ్‌ఎం 1.38 శాతం, ఎటర్నల్ 1.31 శాతం, అదానిపోర్ట్స్ 0.77 శాతం, పవర్‌గ్రిడ్ 0.64 శాతం నష్టపోయాయి.