అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock market | దలాల్ స్ట్రీట్(Dalal street)లో దీపావళి ఉత్సాహం కనిపిస్తోంది. ప్రధాన సూచీలు దూసుకుపోతున్నాయి. ప్రధానంగా రిలయన్స్‌తో (Reliance) పాటు బ్యాంకింగ్ స్టాక్స్ రాణిస్తున్నాయి. కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలు బాగుండడం, గ్లోబల్ మార్కెట్లు సానుకూలంగా ఉండడం, ఎఫ్‌ఐఐలు ఈనెలలో నికర కొనుగోలుదారులుగా మారడం వంటి కారణాలు ర్యాలీకి దోహదపడుతున్నాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్ 317 పాయింట్లు, నిఫ్టీ (Nifty) 115 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 84,239 నుంచి 84,656 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,788 నుంచి 25,926 పాయింట్ల మధ్యలో కదలాడుతున్నాయి. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ (Sensex) 452 పాయింట్ల లాభంతో 84,404 వద్ద, నిఫ్టీ 139 పాయింట్ల లాభంతో 25,8749 వద్ద ఉన్నాయి.
Stock market | పీఎస్‌యూ బ్యాంక్స్‌లో దూకుడు..
పీఎస్‌యూ బ్యాంక్స్ (PSU banks) స్టాక్స్ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఐటీ, ఎనర్జీ రంగాలూ రాణిస్తున్నాయి. బీఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2.64 శాతం పెరగ్గా.. ఎనర్జీ(Energy) 1.24 శాతం, ఐటీ 1.05 శాతం, పీఎస్‌యూ 0.98 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.89 శాతం, టెలికాం 0.77 శాతం, రియాలిటీ 0.73 శాతం, బ్యాంకెక్స్ 0.71 శాతం లాభాలతో ఉన్నాయి. కమోడిటీ 0.14 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.11 శాతం, క్యాపిటల్ మార్కెట్ 0.09 శాతం నష్టాలతో ఉన్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.71 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.50 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.06 శాతం లాభంతో కదలాడుతున్నాయి.
Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 20 కంపెనీలు లాభాలతో ఉండగా.. 10 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. రిలయన్స్ 3.04 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.46 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.07 శాతం, ఎస్‌బీఐ 1.85 శాతం, ఇన్ఫోసిస్ 1.88 శాతం లాభాలతో ఉన్నాయి.
Top losers..
ఐసీఐసీఐ బ్యాంక్ 2.31 శాతం, ఎంఅండ్‌ఎం 1.40 శాతం, ఎటర్నల్ 1.08 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.80 శాతం, అదానిపోర్ట్స్ 0.42 శాతం నష్టాలతో ఉన్నాయి.