HomeజాతీయంDiwali 2025 | దీపావళి 2025: ఈ సారి పండుగ తేదీ ఎప్పుడు, శుభముహూర్తం, విశిష్టతలు...

Diwali 2025 | దీపావళి 2025: ఈ సారి పండుగ తేదీ ఎప్పుడు, శుభముహూర్తం, విశిష్టతలు ఇవే!

హిందూ సంప్రదాయంలో దీపావళి పండుగ కు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. దీన్ని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించే పవిత్ర దినంగా భావిస్తారు. ఈ రోజు లక్ష్మీదేవికి పూజ చేసి, సుఖసంపదల కోసం ప్రార్థించడం ఒక సంప్రదాయం.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Diwali 2025 | ఆశ్వయుజ మాసం అంటేనే విజయానికి ప్రతీక. ఈ మాసం ప్రారంభమే శరన్నవరాత్రులతో (Sharanavaratri) జరుపుకుంటే, ముగింపు శుభదాయకమైన దీపావళి పండుగతో జరుగుతుంది.

అధర్మంపై ధర్మం గెలిచిన ఈ మాసం, పరమశక్తి దుర్గాదేవి (Durga Devi) మహిషాసుర సంహారం చేసిన ఘనతను నెమరేసే వేళ. మాసాంతంలో నరకాసుర సంహారంతో శ్రీకృష్ణుడు విజయదుందుభిని మోగించిన సందర్భాన్ని కూడా దీపావళి స్మరింపజేస్తుంది. అందుకే దీపావళి పండుగను పాపాల నివారణ, ధర్మ విజయం, శుభ సంపదలకు సంకేతంగా భావిస్తారు.

Diwali 2025 | భారతీయ సంస్కృతిలో దీపావళి ప్రాధాన్యత

దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు, అది ఒక గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఘట్టం. రామాయణ (Ramayana) ప్రస్తావనలో, రావణ సంహారం అనంతరం శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యకు (Ayodhya) తిరిగొచ్చిన రోజే దీపావళి. నగర ప్రజలు ఆనందోత్సాహాలతో దీపాల వరుసలతో స్వాగతం పలికారు. అలాగే, పాండవులు అజ్ఞాతవాసం ముగించుకుని హస్తినాపురానికి చేరుకున్న సందర్భం కూడా దీపావళికే సంబంధించింది. వామనావతారంలో విష్ణువు బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన రోజు కూడా ఇదే. కేరళ ప్రజలు దీన్ని బలి అమావాస్యగా ఘనంగా జరుపుకుంటారు.

ఇంకా, తొలి తెలుగు రాజు శాలివాహనుడు విక్రమార్కుడిని ఓడించి దీపావళి రోజే ఆంధ్ర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. విక్రమార్కుడు కూడా దీపావళి రోజే పట్టాభిషేకం పొందాడు. ఇవన్నీ దీపావళికి చారిత్రక, పౌరాణిక ప్రాముఖ్యతను చాటుతున్న ఘట్టాలే.

Diwali 2025 | 2025లో దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి?

దృక్ పంచాంగం ప్రకారం, ఆశ్వయుజ అమావాస్య తిథి (Ashvayuja Amavasya Tithi) అక్టోబర్ 20, 2025 సోమవారం సాయంత్రం 3:44 గంటలకు ప్రారంభమవుతుంది, అక్టోబర్ 21 సాయంత్రం 5:54 గంటలకు ముగుస్తుంది. అందుకే ఈ సంవత్సరం దీపావళి పండుగ అక్టోబర్ 20న జరుపుకోవాలి. ఇదే రోజు లక్ష్మీ దేవిని పూజించి, సుఖసంపదల కోసం ప్రార్థించాలి.

Diwali 2025 | లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం

లక్ష్మీ పూజ (Lakshmi Puja) చేసేందుకు అత్యంత అనుకూలమైన సమయం సాయంత్రం 7:08 నుంచి 8:18 వరకు ఉండనుంది.ప్రదోష కాలం: సాయంత్రం 5:46 నుంచి రాత్రి 8:18 వరకు, వృషభ కాలం: రాత్రి 7:08 నుంచి 9:03 వరకు. కాగా దీపావ‌ళి కేవలం బాణాసంచాలు కాల్చే పండ‌గ మాత్ర‌మే కాదు, విజయం, ఆత్మవిశ్వాసం, ధర్మం మీద నమ్మకానికి ప్రతీక. చరిత్ర, పురాణాలు, విశ్వాసాలు కలబోతగా గల ఈ పండుగ ప్రతి భారతీయుడి మనసులో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఈ దీపావళిని శుభకాంక్షలతో, ఆధ్యాత్మికతతో జరుపుకొని, వెలుగుల మార్గంలో ప్రయాణం ప్రారంభిద్దాం.